విజయవాడ సెంట్రల్ సీటు ఫైనల్ చేసిన వైసీపీ అధిష్టానం..

విజయవాడ సెంట్రల్ సీటు ఫైనల్ చేసిన వైసీపీ అధిష్టానం..
x
Highlights

గత మూడు రోజులుగా వైసీపీలో జరుగుతున్న అంతర్యుద్ధానికి నేటితో తాత్కాలిక తెర పడింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా మల్లాది విష్ణు...

గత మూడు రోజులుగా వైసీపీలో జరుగుతున్న అంతర్యుద్ధానికి నేటితో తాత్కాలిక తెర పడింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ ఇంచార్జిగా తనను నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కు ధన్యవాదాలు తెలిపారు. బ్రాహ్మణులకు జగన్ న్యాయం చేస్తానని చెప్పాడు. కచ్చితంగా చేసి తీరతాడు. ఇక ఎవరు ఏ ఆరోపణలు చేసినా పాజిటివ్‌గా స్పందించడమే తన నైజమన్నారు. 22వ తేదీ నుంచి ‘రావాలి జగన్ కావాలి జగన్’ పేరుతో ప్రజల్లోకి వెళుతున్నవిష్ణు.. ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విషయంలో వైసీపీ నేతలు రాధా, మల్లాది విష్ణు మధ్య వార్ నడుస్తుండగా.. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా మల్లాదికి బాధ్యతలు అప్పగించడాన్ని వంగవీటి రాధా తీవ్రంగా వ్యక్తిరేకిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories