బీజేపీలోకి సూపర్ స్టార్..? మోడీతో భేటీ..

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బీజేపీకి సినీ గ్లామర్ తక్కువైందనే అభిప్రాయంలో ఉందట. దాంతో సినీ...
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బీజేపీకి సినీ గ్లామర్ తక్కువైందనే అభిప్రాయంలో ఉందట. దాంతో సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. భారతీయ గానకోకిల లతా మంగేష్కర్ ను కలిశారు. తాజాగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే అయన బీజేపీలో చేరతారంటూ రూమర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. అందుకు బలమైన కారణం ఇటీవల మోహన్ లాల్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకోవడమేనట. పైగా ప్రధాని మోడీతో అయన భేటీ అవ్వడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానిని కలిసిన విషయాన్నీ మోహన్ లాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'జన్మాష్టమి రోజు ప్రధానిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. గ్లోబల్ మలయాళీ రౌండ్ టేబుల్ సమావేశానికి సంపూర్ణ సహకారం అందించడానికి ప్రధాని ఒప్పుకొన్నారు. ఇది కేరళలో కొత్త ఒరవడిని తీసుకువస్తుంది' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా మోహన్ లాల్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరుపున తిరువనంతపురం నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMTమోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు
10 Aug 2022 3:15 PM GMTPriyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మరోసారి కరోనా
10 Aug 2022 3:00 PM GMT