కత్తి మహేష్- పవన్ ఫ్యాన్స్.. ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత!

కత్తి మహేష్- పవన్ ఫ్యాన్స్.. ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత!
x
Highlights

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా...

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు. కొద్దిసేపటి క్రితం సినీ విమర్శకుడు కత్తి మహేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చాడు. ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. తన సొంత కారును వదిలేసి, ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుని ప్రెస్ క్లబ్ కు వచ్చిన ఆయన, తనను చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడుతూ, ముందు చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, ఇప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. మరో పది నిమిషాలు లేదా పావుగంట పాటు పవన్ తరఫున ఎవరు వస్తారో చూస్తానని, ఎవరూ రాకుంటే, తాను చెప్పదలచుకున్నది చెప్పి వెళ్లిపోతానని అన్నాడు. తన చాలెంజ్ ని ఎవరైనా స్వీకరిస్తారేమో వేచి చూస్తానని చెప్పాడు. ఇదిలావుండగా, ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, అక్కడికి చేరుకున్న పవన్ కల్యాణ్ అభిమానులను ఎవరినీ గేటు దాటి లోనికి వచ్చేందుకు అనుమతించడం లేదు.

పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తనపై చేస్తున్న వ్యాఖ్యలను కత్తి మహేష్ ప్రస్తావించారు. పవన్ ఫ్యాన్స్ తనపై సామాజిక దాడి చేస్తున్నారని, వెబ్‌సైట్‌లో తనపై, తన కుటుంబంపై తప్పుడు రాతలు రాస్తున్నారని కత్తి మహేష్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి తనను మానసిక క్షోభకు గురి చేశారని కత్తి అన్నారు. ఈ సమస్యకు పవన్ నుంచి పరిష్కారం వస్తుందనుకున్నానని, కానీ పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కత్తి వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకే ప్రెస్‌క్లబ్‌కు వచ్చానని, తన రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని కత్తి మహేష్ చెప్పారు. కత్తి మహేష్ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నాడన్న సమాచారం తెలుసుకున్న పవన్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ‘‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ ఎందుకు.. మేము చాలు’’ అంటూ అభిమానులు ప్రెస్‌క్లబ్ లోపలికి దూసుకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఫ్యాన్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories