హే.. మళ్లీ ఏసేసాడు

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి విమర్శలు గుప్పించాడు. ఇటీవలే ...
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి విమర్శలు గుప్పించాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్‌పై ప్రశ్నల వర్షానికి స్వల్ప విరామం ప్రకటించి.. అంతా అభిమానుల చేతుల్లోని ఉందని హెచ్చరించిన మహేశ్ కత్తి.. తన విమర్శల పర్వాన్ని మళ్లీ ప్రారంభించాడు. ఇప్పటివరకు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన మహేష్ కత్తి తాజాగా `అజ్ఞాతవాసి` గురించి విమర్శలు చేశారు.
‘ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?’ , ‘అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన టీజర్‌ను బేస్ చేసుకుని ‘అజ్ఞానవాసి’ పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు. `అజ్ఞాతవాసి` టీజర్ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని మరో పోస్ట్ పెట్టారు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైలర్‌ను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి, `ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి` అని పోస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
పాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMT