ఇదేంది మ‌హేషా..ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అంత‌మాట అనేశావ్

ఇదేంది మ‌హేషా..ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అంత‌మాట అనేశావ్
x
Highlights

క‌త్తి మ‌హేష్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క‌త్తినూరుతున్నారు. గ‌తంలో కాట‌మ‌రాయుడి రివ్యూ నుంచి ఏదో ఒక‌సంద‌ర్భంలో క‌త్తిమ‌హేష్ ఇరుకున పెట్టే...

క‌త్తి మ‌హేష్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క‌త్తినూరుతున్నారు. గ‌తంలో కాట‌మ‌రాయుడి రివ్యూ నుంచి ఏదో ఒక‌సంద‌ర్భంలో క‌త్తిమ‌హేష్ ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఒకానొక సంద‌ర్భంలో పాలిటిక్స్ , సినిమాలతో మ‌మ అనిపించుకున్న క‌త్తి వ్య‌క్తిగ‌త జీవితాల్ని టార్గెట్ చేస్తూ వ‌చ్చాడు. దీంతో కొంత‌మంది పెద్ద‌మ‌నుషులు క‌ల‌గ‌జేసుకొని వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ స‌ఫ‌లం అయ్యాయి. కానీ తాజాగా క‌త్తిమ‌హేష్ అగ్నికి ఆజ్యం పోసేలా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించాడు. వ్య‌క్తిగ‌తం కాకుండా పొలిటిక‌ల్ ప‌రంగా విమ‌ర్శిస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.
ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ద్ద‌తుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఈ నెల 21 నుంచీ న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు నా మద్దతు తెలుపుతున్నాను అని ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా
టీడీపీ అసమర్థ వైఖరి వల్లే బడ్జెట్లో కేంద్రం తెలుగు ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీని విస్మరించడం దారుణమని తెలిపారు. పవన్ కల్యాణ్ బంద్‌కి మద్దతు ప్రకటించడం అభినందనీయమని.. ఆయన ప్రజల్లోకి రావాలని కోరారు. పవన్ రాష్ట్రం పోరాటం చేస్తానంటే ఆయనతోపాటు ఉద్యమంలోకి రావడానికి తానూ సిద్ధమేనని ప్రకటించారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటానికి సినీపరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. ఉద్యమంలోకి రావాలా.. వద్దా.. అనేది వారి వ్యక్తిగత విషయం అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
ఇక కేంద్రం రాష్ట్రానికి ఎంత నిధులు ఎంత ఇచ్చింది. రాష్ట్రం ఎన్ని నిధుల్ని ఖ‌ర్చు చేసింద‌నే విష‌యంపై ప‌వ‌న్ ప‌లువురు మేధావుల‌తో క‌లిసి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’(JFC) ని ఏర్పాటు చేశాడు . అయితే ఆ క‌మిటీ వ‌ల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ క‌త్తిమ‌హేష్ విమ‌ర్శనాస్త్రాలు సంధించాడు.
అంతేకాదు ‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’(JFC) పేరును లోగోను మార్చి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది జస్ట్ ఫర్ ఫన్ కమిటీ అంటూ కొత్త అబ్రివేషన్ ఇస్తూ సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో ను షేర్ చేశారు. ఆ ఫోటోను చూసిన ప‌వ‌న్ అభిమానులు క‌త్తిమ‌హేష్ పై రివెంజ్ తీర్చుకుంటూ ట్విట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆయన్ను టీవీ చానళ్లలో చర్చకు రమ్మంటూ సవాల్ విసురుతున్నారు.
ఇదిలా ఉంటే కత్తి మార్ఫింగ్ చేసి ట్వీట్ చేసిన ఈ జేఎఫ్ సీ ఇమేజ్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. కత్తి మ‌హేష్ ఏం ఆశించి విమ‌ర్శ‌లు చేస్తున్నాడో.. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస్థాన విమ‌ర్శ‌కుడిగా క‌త్తిమ‌హేష్ పేరు పొందాడని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories