logo
సినిమా

ఒక‌టో సారీ..రెండో సారీ

ఒక‌టో సారీ..రెండో సారీ
X
Highlights

కత్తి మహేష్.. ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో రగడ ఆయనకు మంచి గుర్తింపును...

కత్తి మహేష్.. ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో రగడ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మొదట్లో సోషల్ మీడియా ద్వారానే స్పందించిన మహేష్.. ఇటీవల బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్, పూనమ్ కౌర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అటు పవన్ అభిమానులే కాక చాలా మంది కత్తిపై కారాలు, మిర్యాలు నూరారు. ఈ క్రమంలో సంక్రాంతి సీజన్ రావడం..
తన స్వగ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సొంత ఊరికి వెళుతుంటే, పవన్ కల్యాణ్ అభిమానులు తన వెంటపడ్డారని కత్తి మహేష్ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశాడు. "నేను ఇప్పుడే మా గ్రామానికి చేరుకున్నా. దారి మధ్యలో పీలేరు సమీపంలో ఇద్దరు బైకర్లు నన్ను గుర్తు పట్టి, కారును వెంబడించడంతో పాటు 'జై పవన్ కల్యాణ్' అని నినాదాలు చేశారు. నేను ఇంటికి వచ్చిన తరువాత నాకు అర్థమైంది ఏమంటే, ఇటీవల నాకోసం విజయవాడ, తిరుపతి, మదనపల్లి, పుత్తూరు ప్రాంతాల నుంచి మా గ్రామానికి పవన్ అభిమానులు వచ్చి నాకోసం వెతికారు" చెప్పుకొచ్చాడు.
అనంత‌రం మ‌రో డిబెట్లో పాల్గొనేందుకు వెళ‌తుండ‌గా క‌త్తిమ‌హేష్ పై కోడిగుడ్ల‌తో దాడిజరిగింది. ఆ దాడిచేసిన త‌రువాత రోజు జ‌న‌సేపార్టీ త‌రుపు నుంచి తన మొదటి డిమాండ్ పూర్తి అయిందని, రెండో డిమాండ్ ఇంకా ఉందని కత్తి మహేశ్ అన్నారు. జన‌సేన పార్టీ కార్యాలయం నుంచి పవన్‌కల్యాణ్ పేరుతో సందేశం విడుదలైంది. ఈ సందేశంపై స్పందించిన కత్తి మహేశ్, పవన్ కల్యాణ్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఎందుకంటే.. పవన్‌పై నువ్వు విమర్శలు చేస్తున్నావ్. అందుకే నీపై దాడి చేశామని మీడియాముఖంగా పవన్ అభిమానులే తెలిపారు. అలాంటప్పుడు దానికి ఆయన బాధ్యత తీసుకుంటూ నాకు క్షమాపణలు చెప్పడమనేది ప్రజాస్వామ్యంలో సహజం. అంతెందుకు జనాలకు అసౌకర్యం కలిగిందని సీఎం చంద్రబాబు గారే సారీ చెప్పారు. అలాంటిది నా మీద దాడి జరిగితే సారీ చెబితే తప్పేంటి..?. అలా చెబితే పవన్ పెద్దోడే అవుతాడు.’’ అని అన్నారు.

Next Story