భరత్ అనే నేను టీం పై ఫుల్ ప్రెషర్..డేంజర్ జోన్ లో పడ్డ దేవిశ్రీ ప్రసాద్ కెరీర్

భరత్ అనే నేను మూవీతో హోల్ టీం అంతా ప్రెషర్ కుక్కర్ లా మారిపోయారు. మహేష్ బాబు నుంచి మొదలుకోని..డైరెక్టర్,...
భరత్ అనే నేను మూవీతో హోల్ టీం అంతా ప్రెషర్ కుక్కర్ లా మారిపోయారు. మహేష్ బాబు నుంచి మొదలుకోని..డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అందరిపైనా ఒత్తిడి పెరుగుతోంది. భరత్ అనే నేను మూవీ అందరికీ చాలా కీలకంగా మారడంతో ఏ జరుగుద్దో అని తెగ టెన్షన్ పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ పడుతున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు ఫ్లాప్ లు పడ్డాయి..మరి ఇలాంటి పరిస్థితిలోమరో ఫ్లాప్ పడితే ఇక అంతే సంగతులు. దీంతో భరత్ అనే నేను మూవీ మహేష్ కు డూ ఆర్ డై లా మారింది. దీంతో ఈసినిమా మహేష్ పై రోజు రోజుకు ప్రెషర్ పెంచుతోంది. ఈ సినిమాను హిట్ గా మలుచుకునేందుకు చుట్టు పీక్కుంటున్నాడు.
మహేష్ బాబుతో పాటు దర్శకుడు కొరటాల శివ పైన భరత్ అనే నేను మూవీతో ఒత్తిడి పెరుగుతోంది. ప్రజెంట్ ఈదర్శకుడు ఫ్లాప్ ల్లో లేకున్నా..మహేష్ ను గట్టెక్కించే బాధ్యత కొరటాల పైనే ఉంది. తన శక్తియుక్తిలను ప్రదర్శించైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు కొరటాల. దీంతో దర్శకుడిపై ప్రెషర్ పెరుగుతోంది. అందుకే కాస్త లేట్ ఐనా జక్కన్నలా చెక్కుతూనే ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయలేకపోయాడు. ఒకవేళ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసినా..అది ప్రేక్షకులు నచ్చుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నాడు.
భరత్ అనే నేను మూవీకి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ కి కూడా ఈ సినిమా పెద్ద ప్రాణ సంకటంలా మారింది. కొంతకాలంగా దేవి శ్రీ మ్యూజిక్ ఏమాత్రం సందడి చేయడం లేదు. సినిమాలు ప్లాప్ కావడంతో పాటు...ట్యూన్స్ కాపీ కొడుతున్నాడనే ప్రచారం జరగుతోంది. దీంతో ఈ సినిమా ద్వారా తనను తాను మరోసారి నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మరికొంతకాలం కెరీర్ సాఫీగా సాగాలంటే ఈసినిమాతో నిరూపించుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. హీరోయిన్ కైరా అద్వానీని కూడా భరత్ అనే నేను మూవీ కత్తి మీద సాములా మారింది. టాలీవుడ్ లో అమ్మడుకు ఇది ఫస్ట్ సినిమా కావడంతో కెరీర్ ను డిసైడ్ చేసే మూవీలా మారింది. దీంతో కైరా అద్వానీపై కూడా ఒత్తిడి పడుతోంది. సినిమా ఏం చేస్తుందోనని కంగారు పడుతోంది. మొత్తానికి భరత్ అనే నేను మూవీ టీం అందరికీ పెద్ద కత్తి మీద సాములా మారింది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT