మహారాష్ట్ర మాఫియా... ఇసుక తోడేస్తుందయా!!!

మహారాష్ట్ర మాఫియా... ఇసుక తోడేస్తుందయా!!!
x
Highlights

మహారాష్ట్ర ఇసుక మాఫియా దౌర్జన్యానికి తెగబడుతోంది. మంజీరా నదిలో తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చి యథేచ్ఛగా ఇసుకను తోడేస్తోంది. అడ్డుకునేందుకు వెళ్లిన...

మహారాష్ట్ర ఇసుక మాఫియా దౌర్జన్యానికి తెగబడుతోంది. మంజీరా నదిలో తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చి యథేచ్ఛగా ఇసుకను తోడేస్తోంది. అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై దౌర్జన్యాలు చేస్తోంది. బోధన్ జిల్లాలో ఏకంగా ఓ ఐఏఎస్ అధికారి సహా రెవెన్యూ అధికారులపై రాళ్లదాడికి తెగబడింది. సీజ్ చేసిన వాహనాలను బలవంతంగా విడిపించుకుపోయింది.

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నదిలో మహారాష్ట్ర సర్కార్ ఇసుక క్వారీలకు అనుమతినిచ్చింది. ఈ నదిలో ఐదు క్వారీలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని శాకాపూర్ క్వారీ నిర్వాహకులు... సుంకిని వద్ద తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుకను తోడేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం శివారులోని ఈ తంతంగం నడుస్తోంది. తెలంగాణ భూభాగంలో మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు బోధన్ సబ్ కలెక్టర్ నేతృత్వంలో కోటగిరి, వర్ని, రెంజల్ మండలాల తహసిల్దార్లతో కూడిన 30 మంది సభ్యులతో రెవిన్యూ బృందం మంజీరా నదికి వెళ్లింది. తెలంగాణ భూభాగంలో తవ్వకాలు చేస్తున్న నాలుగు జేసీబీలు, బుల్ డోజర్లను స్వాధీనం చేసుకోగా, కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేసి అధికారులు పట్టుకున్న జేసీబీలు, బుల్ డోజర్లను విడిపించుకుని వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

శాకాపూర్ క్వారీ కంట్రాక్టుల దౌర్జన్యంపై రెవెన్యూ అధికారులు కోటగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ భూభాగంలో ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. తెలంగాణ అధికారులపై బరితెగింపు ప్రదర్శించిన శాకాపూర్ క్వారీ కంట్రాక్టర్లు తాత్కాలికంగా మంజీరానదిలోలో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. మహారాష్ట్ర అధికారులు క్వారీ నిర్వాహకులకు మద్దతు పలుకుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఇసుకాసురులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేని పరిస్ధితి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories