ఆత్మస్థుతి.. పరనిందతో మహానాడు ముగించారా?

ఆత్మస్థుతి.. పరనిందతో మహానాడు ముగించారా?
x
Highlights

మూడు రోజుల పసుపు పండుగ ముగిసింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లే టార్గెట్ గా నేతలు స‌మ‌ర శంఖం పూరించారు. మొత్తం 36 తీర్మానాల‌ను మ‌హానాడు ఆమోదించింది....

మూడు రోజుల పసుపు పండుగ ముగిసింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లే టార్గెట్ గా నేతలు స‌మ‌ర శంఖం పూరించారు. మొత్తం 36 తీర్మానాల‌ను మ‌హానాడు ఆమోదించింది. రాష్ట్రంతో పాటు జాతీయ రాజ‌కీయాల‌లోనూ టీడీపీ కీల‌క పాత్ర పోషించాలని తీర్మానించారు. విజ‌య‌వాడలో మూడు రోజుల పాటు జరిగిన మహానాడు ఘనంగా ముగిసింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన మహానాడు కావడంతో రాజ‌కీయంగా ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగింది. దీని తగ్గట్టే టీడీపీ నేత‌లు విపక్షాలపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. గ‌త‌కొద్ది రోజులుగా బీజేపీ టార్గెట్ గా విమ‌ర్శ‌లుచేస్తున్న చంద్ర‌బాబు మ‌హానాడుతో త‌న దూకుడును మ‌రింత పెంచారు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యమంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

మహానాడు చివరిరోజున ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశక్తికరంగా సాగింది. సీఎం పదవిని లోకేష్ కి అప్పగించి.. బాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్నారు. మరోవైపు, పార్టీలోని లోపాలను చంద్రబాబు ఎదుటే జేసి తూర్పారబట్టారు. ప్రజారాజధానిగా అమరావతి- అవాస యోగ్య నగరంపై తీర్మానాన్ని మంత్రి సుజయ కృష్ణ రంగారావు ప్రవేశ పెట్టారు. ఇక మహానాడులో ఆద్యంతంతానై వ్యవహరించారు నారా లోకేష్. కార్యకర్తల వద్దకు వెళ్లి, వారిని పలకరించారు. గత మహానాడుకన్నా ఈ ఏడాది 33శాతం మంది అధికంగా వచ్చారనీ.. మహానాడు సూపర్ సక్సెస్ అనీ లోకేష్ చెప్పారు.

మొత్తంమీద 2019 ఎన్నికలకు ముందు జరిగిన మహానాడు.. పార్టీ శ్రేణులతో పాటు, అధినేత చంద్ర‌బాబుకు కూడా ఫుల్ జోష్ ను ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు కూడా విపక్షాలపై విరుచుకుపడ్డారు. మరోవైపు సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావడం .. మహానాడు సూపర్ సక్సెస్ కావడం తో పార్టీ కేడర్ తో పాటు అధినాయకత్వంలో కూడా నూతన ఉత్సాహం వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories