మానుకోట మనసులో మాట!!

Highlights

స్వరాష్ట్రం, సొంత జిల్లా అభిబివృద్ధి వైపు అడుగులు. మరోవైపు సమస్యల వలయం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది గిరిజన ఖిల్లా. తండాల్లో...

స్వరాష్ట్రం, సొంత జిల్లా అభిబివృద్ధి వైపు అడుగులు. మరోవైపు సమస్యల వలయం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది గిరిజన
ఖిల్లా. తండాల్లో విషజ్వరాలు.... అందుబాటులో లేని వైద్యం. విద్యాలయాలు కరువు.... అంతంత మాత్రంగా రవాణా వ్యవస్థ... ఇదీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి
పురుడోసుకున్న మహబూబాబాద్ జిల్లా ప్రస్తుత ముఖచిత్రం.

కాకతీయుల గడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా విడిపోయింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి... జనగామ...
మహబూబాబాద్ జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఈ జిల్లాను స్దానికులు మనుకోట జిల్లాగా పిలుస్తుంటారు. నూతన జిల్లా జనాభా 7లక్షల 74 వేల 546
మంది. ఇందులో పురుషులు 3 లక్షల 88 వేల 05 మంది, మహిళలు 3 లక్షల 86 వేల 491 మంది. 4 లక్షలపై చిలుకు ఓటర్లు ఉండగా... 450 పైగా గ్రామా
పంచాయితీలు కొలువుదీరాయి.

రెండు నియోజకవర్గాలతో మహబూబాబాద్ జిల్లా రూపుదిద్దుకుంది. ఇవి కాక పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల్లోని 2, 3 మండలాలు ఈ
జిల్లాలో కలిశాయి. భౌగోళికంగా 16 మండాలాలు ఉన్న జిల్లా ముఖ్యంగా రెండు నియోజకవర్గాలతో ఉంది. ఈ జిల్లాలో ప్రధాన సమస్యలు గిరిజన తండాల్లో
తాండవించే విషజ్వరాలు. సరైన సమయంలో సరైన వైద్యం అందక ఏటా వందల సంఖ్యల్లో గిరిపుత్రులు తనువు చాలిస్తున్నారు. ఇప్పటికీ నిరక్షరాస్యత
కనిపిస్తూనే ఉంటుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు... మన్నేరు వాగుపై బ్రిడ్జి, డ్యాం నిర్మాణం... మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేక ప్రజలు తీవ్ర
ఇబ్బందులు పడుతున్నారు. కేసముద్రం, గూడురు. తోర్రురులో గ్రైనేట్ ప్రధాన అదాయ వనరుగా ఉన్నా... అది ప్రజల కష్టాలను తీర్చలేకపోతుంది.

డోర్నకల్‌ నియోజకవర్గంలో ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవన సాగిస్తున్నారు. రైతులకు గిట్టబాట ధరల లభించక గిరిజన రైతులు ఆత్మహత్యలకు
పాల్పడుతున్న ఘటనలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హమీల కంటే ఇప్పుడు సమస్యలే ఎక్కవగా తాండవిస్తున్నాయి. చుట్టూ ఉన్న తండాల ప్రజలు ఏ చిన్న అవసరమైన ఇక్కడికి రావాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories