కూటమిలో కొలిమి!! మాడేదెవరికి? మూడేదెవరికి?

కూటమిలో కొలిమి!! మాడేదెవరికి? మూడేదెవరికి?
x
Highlights

మహాకూటమిలో అప్పుడే లుకలుకలు మొదలైనాయి. రోజు రోజుకు ఎడతేరపి లేకుండా సాగుతున్న చర్చలు, సీట్లు సర్దుబాట్లు కాకపోవడంతో.. జన సమితి అధినేత, కాంగ్రెస్...

మహాకూటమిలో అప్పుడే లుకలుకలు మొదలైనాయి. రోజు రోజుకు ఎడతేరపి లేకుండా సాగుతున్న చర్చలు, సీట్లు సర్దుబాట్లు కాకపోవడంతో.. జన సమితి అధినేత, కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించారు. నలబై ఎనిమిది గంటల్లోగా సీట్లు ఖరారు విషయం తేల్చాలని సూచించారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.
వారాల తరబడి సాగుతున్న మహాకూటమి చర్చలు.. కొలిక్కి వస్తున్న సమయంలో తెలంగాణ జన సమితి ఘలక్ ఇచ్చింది. తమకు ఖచ్చితంగా కోరినన్ని సీట్లు ఇవ్వాలని అల్టిమేటమ్ ఇచ్చింది. మొదటి నుంచి మహాకూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. దీంతోే సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్, తమకు బలమైన స్థానాలు ఉన్న చోట.. ఎట్టి పరిస్థితిలోను వదులుకునేది లేదని ప్రచారం చేస్తూ వస్తోంది. సీట్లు పొత్తుపై మొదటి నుంచి మహాకూటమి నేతల్లో స్పష్టత లేకపోవడంతో బయటికి వివిధ రూపాల్లో లీకులు వచ్చాయి. దీంతో మహాకూటమి నేతల్లో స్పష్టత లేక మల్లగుల్లాలు పడ్డారు. కోదండరాం పార్టీలో ఆయనపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

తెలంగాణ జనసమితికి మూడు లేదా నాలుగు సీట్లే అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు తెలంగాణ జనసమితిలో ఆశావాహుల బాజితా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఇక సమయం వృదా చేసుకోలేక, మహాకూటమిలో పెద్ద పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చారు. తమకు ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ తో పాటు టీడీపీ నేతల ముందు జాబితాను ఉంచారు. ఇప్పుడు టీటీడీపీ 15 వరకు సీట్లు ఆశిస్తోంది. అటు సీపీఐ కూడా 10 నియోజక వర్గాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామంటోంది. కాంగ్రెస్ లో అంతర్గతంగా సీట్ల సర్దుబాటు కాలేదు. ఇక మహాకూటమి పార్టీలకు ఎప్పుడు సీట్ల కేటాయింపు జరిగేది ప్రశ్నార్దకంగా మారింది. టీజేఎస్ నేతల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకో లేక కోదండరాం, కాంగ్రెస్ పార్టీకి చివరగా అల్టిమేటర్ ఇచ్చారు. మరో 48 గంటల్లో ఏ విషయం తేల్చకుంటే.. తామే 21 నియోజక వర్గాల్లో అభ్యర్దులను ప్రకటిస్తామన్నారు. ఆ తరువాత కూడా కాంగ్రెస్ తో పాటు మహూకూటమి నేతలు స్పందించకుంటే.. మరో 80 స్థానాల్లో తమ అభ్యర్దులను పోటీలో దించుతామని స్పష్టం చేశారు. అయితే కోదండరాం అల్టిమేటమ్ తర్వాత టిటీడీపీ, సీపీఐ నేతలు చర్చలు చేస్తున్నారు. మొత్తానికి మహాకూటమిలో పార్టీల మద్య సయ్యోద్య కుదరక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓవైపు కోదండరాంపై టీఆర్ఎస్ నుంచి ముప్పేట దాడి మొదలైంది. తెలంగాణ వ్యతిరేఖ పార్టీలతో ఏ విధంగా పొత్తులు పెట్టుకుంటావంటున్నారు. ఇప్పడు కాంగ్రెస్ నుంచి సరైన సమాధానం లేక ఇబ్బందులో పడ్డ కోదండరాం.. కాంగ్రెస్ వారికి అల్టిమేటమ్ జారి చేసారు. పొత్తులు కుదరకపోతే పార్టీ అభ్యర్దులందరిని బరిలో నిలిపే యోచనలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories