కాంగ్రెస్‌ తొలి జాబితా.. ఇద్దరు సీఎం అభ్యర్థులపేర్లు లేవు..

కాంగ్రెస్‌ తొలి జాబితా.. ఇద్దరు సీఎం అభ్యర్థులపేర్లు లేవు..
x
Highlights

త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు 155 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ శనివారం విడుదల చేసింది. ఇందులో.. కేంద్ర మాజీ మంత్రి...

త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు 155 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ శనివారం విడుదల చేసింది. ఇందులో.. కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ పచౌరీ, అలాగే మాజీ సీఎం అర్జున్‌ సింగ్‌ కుమారుడు అజయ్‌ సింగ్‌ లకు టికెట్లు దక్కాయి. ఇక మధ్యప్రదేశ్ లో ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌, సోదరుడు లష్మన్‌ సింగ్‌లకు కూడా అసెంబ్లీ సీట్లు దక్కాయి.

కానీ మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థులుగా భావిస్తున్న కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియాల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. అలాగే పోలీసు స్టేషన్‌ను కాల్చేస్తామని బెదిరించిన ఖరేరా ఎమ్మెల్యే శకుంతలా ఖటిక్‌కు కు కూడా టికెట్ లభించలేదు. బీజేపీకి గట్టి పునాదులున్న భోజ్‌పూర్‌ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరీ పోటీకి దిగుతున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్‌ గోవింద్‌ సింగ్‌కు భిండ్‌ జిల్లాలోని లహర్‌ సీటు మళ్లీ లభించింది. 230 మంది ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. 177 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారమే ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories