ఎగ్జిట్ పోల్ సర్వేలతో కమలం ఉక్కిరిబిక్కిరా!.. మధ్యప్రదేశ్‌లో కమలం చేజారిపోతోందా?

ఎగ్జిట్ పోల్ సర్వేలతో కమలం ఉక్కిరిబిక్కిరా!.. మధ్యప్రదేశ్‌లో కమలం చేజారిపోతోందా?
x
Highlights

మోడీ ప్రభ తగ్గిపోతోందా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదా? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయి. వచ్చే...

మోడీ ప్రభ తగ్గిపోతోందా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదా? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోడీ విజయానికి కీలకమైన రాష్ట్రంగా చెప్పుకునే మధ్యప్రదేశ్ లో మూడు ఛానెళ్లు కాంగ్రెస్ కే అనుకూలత ఉందని తేల్చగా, మరో రెండు ఛానెళ్లు మాత్రం బిజెపికి ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నాయి. అనుకున్నట్లుగానే మధ్యప్రదేశ్ కమలం చేజారిపోతోందా? సర్వే ఫలితాలు మోడీ టీమ్ కు నిరాశ కలిగించేలా కనిపిస్తున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం, కాంగ్రస్ హోరా హోరీగా తలపడుతున్నట్లు సర్వేల ఫలితాలు తెలియ చేస్తున్నాయి. దాదాపు అయిదు ఛానెళ్లు చేసిన సర్వేల్లో మూడు ఛానెళ్లు కాంగ్రెస్ కే పట్టం కట్టగా టైమ్స్ నౌ, ఇండియా టీవీ సర్వేలు మాత్రం బిజెపి గెలుపు ఖాయమని తేల్చాయి. రిపబ్లిక్ సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 110 నుంచి 126 స్థానాలు గెలుచుకుంటుదని, బిజెపి 90 నుంచి 106 స్థానలు గెలుచుకుంటుందని తెలుస్తోంది. ఇక ఇండియా టీవీ సర్వేలో కాంగ్రెస్, బిజెపికి చాలా గట్టి పోటీ కనిపించింది. కాంగ్రెస్ 104 నుంచి122 సీట్లు గెలుస్తుందని, బిజెపికి 102 నుంచి 120 మధ్య సీట్లు వస్తాయని ఇండియాటుడే సర్వే చెబుతోంది.

ఇక ఏబీపీ సర్వే కూడా కాంగ్రెస్ కు 126 సీట్లు అంచనా వేయగా, బిజెపి 94 సీట్లు గెలుస్తుందని ఇతరులు పది సీట్లు గెలుచుకుంటారనీ చెబుతోంది. ఇక టైమ్స్ నౌ, ఇండియా టీవీ సర్వేలు మాత్రం బిజెపికి ఊరట కలిగించేలా ఉన్నాయి. టైమ్స్ నౌ బిజెపికి 126 సీట్లు, కాంగ్రెస్ కి 89 సీట్లు వస్తాయని తేల్చింది. బీఎస్పీ 6 సీట్లు, ఇతరులు 9 సీట్లు గెలుస్తారని తేల్చింది. ఇండియా టీవీ సర్వే విషయానికొస్తే కాంగ్రెస్ 86 నుంచి 92 సీట్లు గెలిస్తే, బిజెపి 122 నుంచి 130 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటుందని అంచనా వేసింది. బీఎస్పీకి 4నుంచి 8 సీట్లు, ఇతరులు 8 నుంచి పది స్థానాలూ గెలుస్తారన్నది ఈ ఛానెల్ సర్వే. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ బిజెపికి చాలా నష్టం కలిగించిందనే అనుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్న విషయం పై కాంగ్రెస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.. సర్వే ఫలితాలు నిజమే అయితే జ్యోతిరాదిత్య సింధియా, కమల్ నాథ్ లలో ఎవరికి పదవి దక్కుతుందన్నది చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories