వైసీపీకి కలిసివచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. అదనంగా మరో ఎమ్మెల్యే..

వైసీపీకి కలిసివచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. అదనంగా మరో ఎమ్మెల్యే..
x
Highlights

అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని చెప్పి.. ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి...

అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని చెప్పి.. ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గత 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తీర్పునిచ్చింది...ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని ఉల్లంఘించారని తిప్పేస్వామి తరుపు లాయర్లు వాదించారు. ఆయన భార్య ఉద్యోగాన్ని కూడా అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని.. కర్ణాటకలో తనపై ఉన్న కేసుల వివరాలును సైతం పొందుపరచలేదన్నారు.ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఈరన్న ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేల్చింది. దాంతో అతని ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పడమే కాకుండా రెండో స్థానంలో ఉన్న తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా గుర్తించాలని స్పష్టం చేసింది. దాంతో నిన్న తిప్పేస్వామిని వైసీపీ నేతలు కలిసి అభినందించారు. ఈ రకంగా వైసీపీకి మరో ఎమ్మెల్యే కలిసి వచ్చినట్టయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories