పేలిన గ్యాస్‌.. అగ్నికి ఆహుతైన కుటుంబం

పేలిన గ్యాస్‌.. అగ్నికి ఆహుతైన కుటుంబం
x
Highlights

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు...

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో జరిగింది. శ్రీనివాసులురెడ్డి, బుజ్మమ్మ దంపతులు. వారికీ నితిన్‌, భవ్య ఇద్దరు సంతానం. శనివారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు సైతం ఎగిరిపోయింది. కాగా, గ్యాస్‌ ఆఫ్‌ చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గ్యాస్ లీకైన విషయం గ్రహించక ఎలక్ట్రిక్‌ స్విచ్‌ ఆన్‌ చేయడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories