logo

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య..!

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య..!
Highlights

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో చోటుచేసుకుంది.. పెద్దలు తమ...

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో చోటుచేసుకుంది.. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదనే కారణంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.. రైలు కింద పడటంతో వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జు నుజ్జయ్యాయి.. దీంతో ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.. సంఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఏడిదకు చెందిన సూరిబాబుగా గుర్తించగా , యువతీ వివరాలు లభ్యం కాలేదు..


లైవ్ టీవి


Share it
Top