ప్రేమ పావురాలు...ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు

పెళ్లి చేసుకున్నాం, రక్షణ కల్పించండి అంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే.....
పెళ్లి చేసుకున్నాం, రక్షణ కల్పించండి అంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే.. కానీ ఒకే రోజు మూడు ప్రేమ జంటలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. దీంతో జంటలను చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఇదంతా చెన్నై, వేలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుంది. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని రక్షణ కోరారు.
అదేవిధంగా పచ్చూరు గ్రామానికి చెందిన జయశ్రీ పాతపేటకు చెందిన మయిల్ వాణన్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి కూడా ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈనెల 13వ తేదీన వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో విన్నవించారు. ఆంబూరు బీకస్పా ప్రాంతానికి చెందిన దివ్యభారతి అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో ఒప్పుకోవడమేకాక దివ్య భారతికి వేరే వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. దీంతో ఇద్దరూ 11వ తేదీ ఇంటి నుంచి బయటకు వచ్చే పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకొని మూడు జంటలు ఒకేసారి రావడంతో అధికారులు అవాక్కయ్యారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT