logo
తాజా వార్తలు

కులాలు వేరని పెళ్ళికి నిరాకరణ.. ప్రేమజంట ఆత్మహత్య

కులాలు వేరని పెళ్ళికి నిరాకరణ.. ప్రేమజంట ఆత్మహత్య
X
Highlights

తమ ప్రేమను పెద్దలు నిరాకరించారని ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రేమజంట ఈ ఘటన ఉళయనల్లూరు రోడ్డు మార్గంలో...

తమ ప్రేమను పెద్దలు నిరాకరించారని ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రేమజంట ఈ ఘటన ఉళయనల్లూరు రోడ్డు మార్గంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా చిన్నసేలం మండలం వరదప్పనూరు గ్రామానికి చెందిన పూజ (16),అదే ఊరికి చెందిన విఘ్నేష్‌ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేయమని వారి పెద్దలను కోరారు. కులాలు వేరు కావడంతో వారు నిరాకరించారు.దీంతో సమానస్థాపం చెందిన ప్రేమజంట ఉళయనల్లూరు రోడ్డు మార్గంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దారినవెళ్లే వారు వీరిని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కుటుంబసభ్యులను విచారిస్తున్నారు.

Next Story