దేశవ్యాప్తంగా లారీల బంద్.. కారణం ఏంటంటే..

దేశవ్యాప్తంగా లారీల బంద్.. కారణం ఏంటంటే..
x
Highlights

ఇప్పటికే పలు అంశాలతో సతమతమవుతున్న ప్రభుత్వాలకు మరో ఇబ్బంది వచ్చి పడింది. దేశవ్యాప్తంగా లారీల సమ్మె షురూ అయింది. రోజురోజుకు పెరుగుతున్న డీజీల్ ధ‌ర‌ల...

ఇప్పటికే పలు అంశాలతో సతమతమవుతున్న ప్రభుత్వాలకు మరో ఇబ్బంది వచ్చి పడింది. దేశవ్యాప్తంగా లారీల సమ్మె షురూ అయింది. రోజురోజుకు పెరుగుతున్న డీజీల్ ధ‌ర‌ల భారం, థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ధ‌ర‌లు, టోల్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మె సైరన్ మోగించారు. అర్ధరాత్రి నుంచి ఎక్కడి లారీలను అక్కడే నిలిపివేశారు. ఈ సమ్మెతో తెలుగు రాష్ట్రాలలో 7 లక్షల లారీలు నిలిచిపోయాయి. దీంతో సుమారు 16 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడనున్నారు. మరో 30లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడనుంది. విపరీతంగా టోల్ ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారని.. పెరిగిన డీజిల్ ధరలు తమకు మోయలేని భారంగా పరిణమించాయని లారీ యాజ‌మానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌మ‌స్య‌లు విన్న‌వించినా ప‌ట్టించుకోలేదంన్నారు. ఇక చేసేదేంలేకే సమ్మె చేప‌ట్టామని లారీ యజమానులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories