రోడ్డు ప్రమాదంలో మరణాలు

రోడ్డు ప్రమాదంలో మరణాలు
x
Highlights

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడుతో వెళుతున్న లారి అదుపుతప్పి లోయలో పడింది.దీంతో ఏడుగురు కూలీలు మృతిచెందారు....

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడుతో వెళుతున్న లారి అదుపుతప్పి లోయలో పడింది.దీంతో ఏడుగురు కూలీలు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా కల్లనరసంబట్టు గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం విజలా పురం గ్రామానికి వచ్చారు.శనివారం ఉదయం నుంచి మామిడి కాయలు కోసి లారీలోకి నింపి అదే వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఓ వైపు జోరు వర్షం పడుతుండగా.. లారీ వేలూరుకు ప్రయాణమైంది. కుప్పం మండలం పెద్దవంక ఘాట్‌ రోడ్డు వద్ద లారీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మరో కొందరు క్షతగాత్రులయ్యారు. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆరాతీస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories