లోక్‌సభ ఎన్నికల్లో లోకల్‌ పార్టీలదే హవా!!

లోక్‌సభ ఎన్నికల్లో లోకల్‌ పార్టీలదే హవా!!
x
Highlights

ప్రాంతీయ పార్టీలు హస్తిన వైపు చూస్తున్నాయి. అందులో అనుమానం లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేల్చిచెబుతున్న ఈ పరిస్థితుల్లో ఫ్రంట్ పేరిట కూటమి...

ప్రాంతీయ పార్టీలు హస్తిన వైపు చూస్తున్నాయి. అందులో అనుమానం లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేల్చిచెబుతున్న ఈ పరిస్థితుల్లో ఫ్రంట్ పేరిట కూటమి పార్టీలను ఏకం చేస్తున్నారు. ఆ దిశలోనే ప్రాంతీయ శక్తులన్నీ ఏకీకరణ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఆసేతు హిమాచలం విస్తరించిన కాషాయానికి, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌‌కు ప్రత్నామ్నాయంగా పావులు కదుపుతున్నారు. జాతీయ పార్టీల పీచమణచాలంటే... ఫ్రంట్‌తో వాటి నోరు మూయించాలని, ఆ ఆయుధంతోనేే ఢిల్లీ గద్దెను ఎక్కాలన్న ఆలోచనతో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే.. ఢిల్లీ గద్దెపై మనం చూసేందేమిటి?

2014లో మోడీ హవాతో కమలం మరింత వికసించింది. దాదాపుగా ఆ సేతు హిమాచలం కమ్మేసింది. తర్వాత ప్రభ తగ్గినా ప్రాభవం వాడలేదు. ఎన్డీయే కూటమి పార్టీల మద్దతు తీసుకోకుండా... వారి సహకారం అవసరం లేకుండా ఐదేళ్లు ఈడ్చుకొచ్చిన మోడీకి... ఇప్పుడు ప్రాంతీయ పార్టీల రూపంలో ముప్పు పొంచి ఉందంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి 2019లో ఏం జరగబోతుందో ఇప్పుడిప్పుడే ఊహించడం కష్టమే కావచ్చు... కానీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. పరిస్థితి తప్పకుండా మారుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలో, భాగస్వామ్య పక్షాలుగా 32 పార్టీలు ఉండగా.... తర్వాత సీను మారిపోయింది. ఒక్కొక్కరు విడిపోయారు. ప్రధాన సంఖ్యాబలంతో ఉన్న టీడీపీ, శివసేనలాంటి పార్టీలు మోడీ ధోరణి నచ్చక బయటకు వచ్చేశాయి. ఇక కాంగ్రెస్‌ది కూడా అదే పరిస్థితి. రాబోయే లోకసభ ఎన్నికల వరకు ఈ సంఖ్యాబలంతో ఎన్డీయే ప్రభుత్వానికి ఎలాంటి ఢోఖా లేదు. ఎవరి మద్దతున్నా లేకపోయినా బీజేపీకి స్వయానా 280 మంది సభ్యుల దాకా ఉన్నారు కాబట్టి... అధికారానికి ఇబ్బంది లేదు. కానీ 2019లో పరిస్థితి ఏంటి?

రాబోయే సార్వత్రక ఎన్నికల అనంతరం, ప్రాంతీయ పార్టీల సారథ్యంలో-అండదండలతో, ఎన్డీయేతర– యూపీయేతర సంకీర్ణ ప్రభుత్వం రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కాని, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కాని ఎన్నికలయ్యేంత వరకు బీజేపీతో, కాంగ్రెస్‌తో కలిసి వున్నా, ఆ తరువాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయన్నది వారి అభిప్రాయం. ఎప్పటికీ అటు కాంగ్రెస్ వారినో, లేదా బీజేపీ వారినో ఎందుకు ప్రధాని చేయాలి... తమలోనే ఒకరు కాకూడదా అనే అభిప్రాయానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఇదే మాట చెప్పారు. రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారు. కాంగ్రెస్ పార్టీని– యూపీఏని వీడిన అలనాటి మిత్రపక్షాలు కాని, ఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదు. అదే పరిస్థితి బీజేపీది కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపించగలవన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories