కారు పార్టీలో లోకల్ క్యాంప్ పాలిటిక్స్...రంగంలోకి దిగిన కేటీఆర్‌

x
Highlights

టీఆర్ఎస్ లో అసమ్మతి పోరు తారస్థాయికి చేరుకుంటోంది. స్థానిక సంస్థల్లో ఇంత కాలం ఉన్న గ్రూపు రాజకీయాలు ఒక్క సారిగా గుప్పుమంటున్నాయి. ఈ గొడవలతో...

టీఆర్ఎస్ లో అసమ్మతి పోరు తారస్థాయికి చేరుకుంటోంది. స్థానిక సంస్థల్లో ఇంత కాలం ఉన్న గ్రూపు రాజకీయాలు ఒక్క సారిగా గుప్పుమంటున్నాయి. ఈ గొడవలతో విసిగిపోయిన సోమారపు సత్యనారాయణ రాజీనామా దాకా వెళ్లి కేటిఆర్ జోక్యంతో మనసు మార్చుకున్నారు. అయినా కౌన్సిలర్లు, ఎమ్మెల్యేల తీరులో మార్పు మాత్రం లేదు మున్సిపల్ ఛైర్మన్లు, మండలాల ఎంపిపీలను తొలగించేందుకు చేస్తున్న క్యాంప్ రాజకీయాలు కారు పార్టీని గందరగోళంలో పడేస్తున్నాయి.

టీఆర్ఎస్ లో గడబిడ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపార్టీలో రచ్చ రాజేస్తున్నాయి మాటవినని లోకల్ లీడర్లను దారికి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విభజనకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటి స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాని ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికార బలంతో మున్సిపాలిటి చైర్మన్లు, మండల ఎంపీపీలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. విపక్షమే ఉండకూడదన్న లక్ష్యంతో కౌన్సిలర్లు, వార్డు మెంబర్లకు సైతం గులాబి తీర్ధం ఇచ్చారు.

ఇక్కడి వరకూ బానే ఉంది..కానీ ఆ తర్వాతే సీన్ మారింది. ప్రతి మున్సిపాలిటి, మండలంలో గ్రూపులు మొదలయ్యాయి. కొందరు టీఆర్ఎస్ కు భయపడి నోరుమూసుకున్నా రాష్ట ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యహరించింది. కనీసం వార్డుల్లో మంచి నీటి కోసం బోర్లు వేయకుండా ఆంక్షలు విధించింది. ఏ మాత్రం సొంత నిర్ణయాలకు ఆస్కారం ఇవ్వకుండా అంతా పై నుంచే నడిపించారు. మున్సిపాలిటీలు, మండలాలపై ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోయింది. దీంతో ప్రజా ప్రతినిధుల స్వతంత్రత ప్రశ్నార్ధకంగా మారింది.

నాలుగేళ్లు పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వరంగల్ జిల్లా పరకాల, నల్గోండ జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్లు తమ పూర్వ పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు వారిద్దరిని గద్దేదింపేందుకు పావులు కదిపారు. వారిపై కౌన్సిలర్ల చేత అవిశ్వాస తీర్మానం పెట్టించారు. సంగారెడ్డి జిల్లా సదాశివ పేట్ మున్సిపాలిటి చైర్మన్ పట్నం విజయలక్ష్మీపై విశ్వాసం లేదంటూ 15 మంది కౌన్సిలర్లు నోటిసులిచ్చారు. ఈ నోటిసుపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సొదరుడు కౌన్సిలర్ గోపాల్ సంతకం చేయడంతో ఈ అవిశ్వాసం వెనక ఎమ్మెల్యే హస్తం ఉందని తేలింది. బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ ఎల్లంపై అవిశ్వాసాన్ని కోరుతూ 29 మంది కౌన్సిలర్లు కలెక్టర్ రామ్మెహన్ ను కలిసారు. చైర్మన్ ను తప్పించడం వెనక స్థానిక ఎమ్మెల్యే షకీల్ చక్రం తిప్పుతున్నారు. సొంత పార్టీ కి చెందిన చైర్మన్ ఎల్లంను గద్దే దింపి ఆ స్థానంలో MIM ను కూర్చొబెట్టడం కోసమే షకీల్ ఇదంతా చేస్తున్నారట.

ఇక రామగుండం కార్పోరేషన్లో టీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమంది. మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యే సత్యనారాయణ మధ్య వార్ చివరకు కేటిఆర్ దాకా వెళ్లింది. అయినా ఎవరూ తగ్గడం లేదు. అటు బెల్లంపల్లి, వేముల వాడ, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో సేమ్ సీన్. గంగాధర, కథలాపూర్, ఎలిగేడు, మంథని, ముత్తారం ఎంపీపీలపై కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఎంపీటీసీలతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ అవిశ్వాసాల పట్ల టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లలో చర్చలు జరిపారు. అయినా కౌన్సిలర్లు వెనక్కు తగ్గడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories