హైదరాబాద్ లో జోరుగా సాగుతున్న లిక్కర్ చాక్లెట్స్ విక్రయం....

హైదరాబాద్ లో జోరుగా సాగుతున్న లిక్కర్ చాక్లెట్స్ విక్రయం....
x
Highlights

లిక్కర్ చాక్లెట్స్(మద్యం చాక్లెట్స్) వినియోగం భాగ్యనగరిలో ఆందోళన కల్గిస్తోంది. చాలా మంది వినియోగదారులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మఖ్యంగా...

లిక్కర్ చాక్లెట్స్(మద్యం చాక్లెట్స్) వినియోగం భాగ్యనగరిలో ఆందోళన కల్గిస్తోంది. చాలా మంది వినియోగదారులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు తమ భాగస్వామికి వీటిని బహుమతిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు.

హైదరాబాద్ లో మద్యం చాక్లెట్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చాక్లెట్స్ లోని లిక్కర్ బ్రాండ్ వ్యాల్యూని బట్టి.. వీటి ధర నిర్ణయిస్తున్నారు. మద్యం చాక్లెట్స్ ను సిటీలో స్టోర్ చేసి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా డెన్మార్క్ నుంచి ఢిల్లీకి దిగుమతి చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు వీటిని తీసుసకొస్తున్నారు. గిఫ్ట్ షాప్స్, మాల్స్ లో వీటిని ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

కానీ, వీటిని విక్రయించాలంటే లైసెన్స్ తప్పనిసరి అని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. అనుమతులు లేకుండా లిక్కర్ చాక్లెట్స్ విక్రయించడం నేరమని తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే... ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34(ఎ) కింద మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదంటున్నారు. నగరంలో లిక్కర్ చాక్లెట్స్ అమ్మే దుకాణాలు, గిఫ్ట్స్ షాప్స్ యాజమానులు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాటిని విక్రయిస్తే.. నేరం కిందకు వస్తుందని అధికారులు అంటున్నారు.


గత వారంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అబిడ్స్ అలాగే అమిర్ పేటలోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 1,081 లిక్కర్ చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ కూడా ఎలాంటి లైసెన్సులు లేకుండా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ దాడుల్లో లిక్కర్ చాక్లెట్స్ తయారు చేసేందుకు సిద్దంగా ఉన్న రమ్, విస్కీ, వోడ్కా నిల్వలను సీజ్ చేశారు.

పుట్టగొడుగుల్లా ఉండే.. 13 రకాల ఫ్లేవర్స్ లో ఈ మద్యం చాక్లెట్స్ ప్రధానంగా విక్రయిస్తున్నారు. అందులో ఐరిష్ క్రీమ్, చాకోలేట్ కాక్ టైల్, స్ట్రాబెరీ ఇన్ షాంపైన్ లేదా రెస్బెర్రీ ఇన్ ఆరెంజ్ లిక్కర్ చాక్లెట్స్ దాదాపు 96బాక్సుల్లో ప్యాక్ చేసి ఉన్నాయి. వీటిని వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో దిగుమతి చేస్తున్నారు.

ఈ మేరకు దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు అబిడ్స్ లోని ఓ దుకాణంపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ చాక్లెట్స్ ను దిగుమతి చేసుకుని రాజనీష్ కుమార్ అండ్ సన్స్ వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి వివరాల మేరకు... ‘నగరంలోని చాలా మంది హోల్ సేలర్స్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లిక్కర్ చాక్లెట్స్ ను దిగుమతి చేసుకుంటున్నారు. అనంతరం స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అలాగే కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండా స్థానికంగా లిక్కర్ చాక్లెట్స్ ను తయారు చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా తయారు చేసిన ఈ చాక్లెట్స్ చాలా ప్రమాదకరం.’

సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతున్న లిక్కర్ చాక్లెట్స్ విక్రయానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పేస్ బుక్ ద్వారా లిక్కర్ చాక్లెట్ష్ విక్రయదారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఒక్కో బాక్స్ లో 10 నుంచి 12లిక్క్ ర్ చాక్లెట్స్ ఉంటాయి. వీటి ధర రూ.300 నుంచి ప్రారంభమవుతుంది. లిక్కర్ ఫ్లేవర్ ను బట్టి ధర పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories