పూజలు... హోమాలు... యాగాలు... గుడిబాట ఎందుకోసం?!

పూజలు... హోమాలు... యాగాలు... గుడిబాట ఎందుకోసం?!
x
Highlights

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఒకవైపు ఆర్థిక భారం... మరోవైపు గెలుస్తామో లేదోనన్న భయం. ఇప్పుడు తెలంగాణ రాజకీయ...

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఒకవైపు ఆర్థిక భారం... మరోవైపు గెలుస్తామో లేదోనన్న భయం. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేతల్లో ఇదో రకమైన ఆందోళన కనిపిస్తోంది. దీన్ని అధిగమిచేందుకు కొందరు యాగాలను నమ్ముకుంటుంటే ఇంకొందరు తమ ఇష్ట దేవుళ్లను దర్శించుకుంటున్నారు. దేవుడా నీదే భారమంటూ గుడి మెట్లెక్కుతున్నారు.

సహజంగానే ఎన్నికల్లో పోటీ చేయడం అంటే కాస్త సాహసంతో కూడుకున్న పనే. టిక్కెట్ సంపాదించిన దగ్గర నుంచి ఎన్నికల్లో గెలిచే వరకు టెన్షనే. దీనికితోడు ఆర్థిక భారం కూడా ఎక్కువే. టిక్కెట్ సంపాదించిన దగర్గ నుంచి ప్రచారంలో తిరగాలంటే రోజుకు వేలు, లక్షలు వదలాల్సిందే. లేదంటే వెనుక తిరగే వారు ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. ఇక ప్రత్యర్ధి పార్టీల్లోంచి జంపింగ్ జపాంగ్‌లను తీసుకురావాలంటే నానా తంటాలు పడాల్సిందే. ఎన్నికల సమయం కాబట్టి వచ్చే వాళ్లు అంత ఈజీగా వస్తారా. వారికి ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశను తీర్చాల్సిన బాద్యత ఎమ్మెల్యే అభ్యర్ధులదే.

ఇక ఇవన్నీ తట్టుకుని నిలబడి ఎన్నికల్లో పోటీచేసిన గెలుస్తామో లేదోనన్న టెన్షన్ రిజల్ట్ వరకు ఉంటుంది. ఇక ఎన్నికల హడావిడి ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇక ఓసారి దేవుణ్ణి దర్శించుకొని గెలుపులో నీ భారం కూడా ఉందని మొక్కులు చెల్లించుకుంటున్నారు మన రాజకీయ నేతలు. ముందుగానే తమకు ఇష్టమైన దేవుణ్ని దర్శించుకుని వస్తే ఓ పనైపోతుందని భావించిన నేతలు ఇప్పటికే పుణ్యక్షేత్రాల బాటపట్టారు. సీఎం కేసీఆర్ అభ్యర్ధుల ప్రకటనకు ముందు తర్వాత కూకట్‌పల్లికి చెందిన కొంతమంది నేతలు తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వచ్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి దేవుళ్లను దర్శించుకొని గుండు కొట్టించుకొని వచ్చారు. ఇక నగరంలో కీలక మంత్రిగా ఉన్న నేత స్వామివారిని దర్శించుకొని వచ్చారు. మల్కాజ్‌గిరి తాజా మాజీ ఎమ్మెల్యే వెంకన్న దర్శనం చేసుకొని వచ్చారట. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే అన్నవరం దర్శనానికి వెళ్లి వచ్చారు. ఇలా చాలామంది నేతలు తమకిష్టమైన దేవుళ్లను దర్శించుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రాప్తించాలని కోరుతున్నారట. రంగారెడ్డి జిల్లా పరిగి తాజా మాజీ ఎమ్మెల్యే యాగాలు చేసి పార్టీ నేతలనందరినీ పిలిచారు. మొత్తానికి ఎన్నికల ముందు నేతలు పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. ఇంకా ఇలాంటి సిత్రాలు ఎన్నికలవరకు ఎన్ని చూడాలోనన్న చర్చ సామాన్య ప్రజల్లో జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories