Top
logo

ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మెట్రో నేడే

ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మెట్రో నేడే
X
Highlights

భాగ్యనగర్ వాసులకు శుభవార్త.. ఎల్బీనగర్‌ - అమీర్‌పేట్‌ మార్గంలో నేటి నుంచి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది....

భాగ్యనగర్ వాసులకు శుభవార్త.. ఎల్బీనగర్‌ - అమీర్‌పేట్‌ మార్గంలో నేటి నుంచి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో మొత్తం 17 స్టేషన్లు ఉండగా.. నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అక్కడ్నుంచి మియాపూర్ దాకా 30 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలందుతున్నాయి.

Next Story