logo
సినిమా

సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్న రజిని 'కాలా'

సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్న రజిని కాలా
X
Highlights

రజినీకాంత్ మేనియా.. సినీ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇవాళ కాలా మూవీ విడుదల సందర్భంగా ఫ్యాన్స్ పండుగ...

రజినీకాంత్ మేనియా.. సినీ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇవాళ కాలా మూవీ విడుదల సందర్భంగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తమిళ, తెలుగు రాష్ట్రాలే కాకుండా.. ముంబైలో కూడా రజినీ ఫ్యాన్స్.. సంబరాలు జరుపుకున్నారు. ఓ వైపు వర్షం పడుతున్నా.. డ్యాన్సులతో హంగామా చేశారు. డ్రమ్స్ వాయిస్తూ.. దానికి అనుగుణంగా స్టెప్పులేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం.. ముంబైలోని అన్ని థియేటర్ల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక రజినీ మహిళా అభిమానులు సంప్రదాయబద్దంగా తయారై థియేటర్ కు వచ్చారు. తలపై బోనాలు పెట్టుకుని సినిమా హాల్‌ దగ్గరకు వచ్చారు. దేవుళ్లకు ఇచ్చే బోనాలు.. తమ అభిమాన నటుడికి ఇస్తున్నట్లుగా.. బోనాలు తీసుకొచ్చిన మహిళలకు.. థియేటర్ దగ్గర ఘన స్వాగతం లభించింది. మరోవైపు థియేటర్‌లో కాలా మూవీ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. లోనికి వెళ్లేందుకు క్యూ కట్టారు. ఫస్ట్ షో చూసేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచే థియేటర్ల దగ్గర భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.

Next Story