logo
జాతీయం

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత
X
Highlights

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి...

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఆయన తనంతట తాను నిలబడలేకపోతున్నారని, కూర్చోలేకపోతున్నారని లాలూను పరామర్శించిన ఆర్జేడీ వర్గాలు తెలిపాయి.

దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకులు లాలూను కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లాలూకు మరింత మెరుగైన చికిత్స అవసరమని, ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించాలని ఆర్జేడీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆసుపత్రిలో లాలూను కలుసుకున్నారు ఆయన భార్య రబ్రీదేవి, ఇద్దరు కుమారులు.

Next Story