లడ్డూ కావాలా నాయనా!! ఇంకెన్నాళ్లీ కుంభకోణాలు

లడ్డూ కావాలా నాయనా!! ఇంకెన్నాళ్లీ కుంభకోణాలు
x
Highlights

తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. టోకెన్ల ద్వారా విక్రయించే లడ్డూలను సిబ్బంది పక్కదారి పట్టించారు. వేల సంఖ్యలో లడ్డూలను బ్లాక్...

తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. టోకెన్ల ద్వారా విక్రయించే లడ్డూలను సిబ్బంది పక్కదారి పట్టించారు. వేల సంఖ్యలో లడ్డూలను బ్లాక్ లో అమ్ముకున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూను భక్తులు మహా ప్రసాదంగా భావిస్తారు. ఎంతో శ్రమకోర్చి లడ్డూలు తీసుకుంటారు. భక్తులకు సక్రమంగా అందించాల్సిన లడ్డూలు కొందరు పక్క దారి పట్టిస్తున్నారు. భక్తులకు పారదర్శకంగా అందంచేందుకు టీటీడీ టోకెన్ల విధానం ప్రవేశపెట్టింది. అయినా సిబ్బంది , దళారులు కలిసి వాటిని కూడా కొత్త కొత్త మార్గాల్లో పక్కదారి పట్టిస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా 14, 15 తేదీల్లో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తుల సంఖ్య లక్షకు దాటింది. ఈ క్రమంలో లడ్డూల టోకెన్లు స్కాన్ కాలేదు. అధికారుల ఆదేశాలతో మాన్యువల్ గా భక్తులకు లడ్డూలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా వేల సంఖ్యలో లడ్డూలను సిబ్బంది మూడోకంటికి తెలియకుండా కాజేశారు. భక్తులకు ఇచ్చిన టోకెన్లు స్కాన్ కాలేదని నమోదు చేశారు. అవే టోకెన్లు తిరిగి స్కాన్ చేసి సిబ్బంది లడ్డూలు తీసుకున్నారు.

భక్తుడికి చేరాల్సిన లడ్డూలు భక్తుడికి చేరిపోయాయి. చేతివాటం ప్రదర్శించి అక్రమ మార్గంలో కాజేసిన లడ్డూలను బ్లాక్ లో విక్రయించుకోవడంతో సిబ్బంది జేబులు నిండాయి. ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో కౌంటర్ సిబ్బంది కలిసి లడ్డూలను కాజేసి దొడ్డి దారిలో టీటీడీ ఖాజానాకు లక్షల రూపాయల్లో గండి కొట్టారు. అయితే లడ్డూల కుంభకోణంపై లోతుగా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఎప్పటి నుంచి ఈ లడ్డూల టోకెన్ల గోల్ మాల్ సాగుతోంది. సిబ్బంది వెనుక ఎవరి హస్తం ఉందనే విషయాలపై కూపీ లాగుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories