కుమారస్వామికి రాజయోగం.. పట్టాభిషేకం అదేరోజు.. డిప్యూటీ ఆయనకే!

కుమారస్వామికి రాజయోగం.. పట్టాభిషేకం అదేరోజు.. డిప్యూటీ ఆయనకే!
x
Highlights

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది కుమారస్వామి అనే చెప్పాలి. మెజారిటీ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా...

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది కుమారస్వామి అనే చెప్పాలి. మెజారిటీ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 111 మంది ఎమ్మెల్యేల మద్దతు లేక ప్రమాణస్వీకారం చేసి మరీ రాజీనామా చేశారు బీజేపీ నేత యడ్యూరప్ప. ఈ తరుణంలో మిత్రపక్షాలైన కాంగ్రెస్ ,జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. కాంగ్రెస్ కు 76 జేడీఎస్ కు 38 మంది శాసనసభ్యులు ఉన్నారు. వీరి మధ్య పొత్తు కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు జేడీఎస్ నేతలు.. అసెంబ్లీలో నిన్న జరిగిన తతంగం ప్రతుల రూపంలో సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఇవాళ ఆదివారంసెలవు కనుక రేపు వాటిని పరిశీలిస్తుంది సుప్రీం అనంతరం మెజారిటీ సభ్యులున్న పార్టీకి అవకాశమివ్వమని గవర్నర్ కు సూచిస్తుంది. ఈ క్రమంలో అన్ని కుదిరితే మే 23 న బుధవారం సాయంత్రం కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎంగా తాజా మాజీ మంత్రి డీకే శివకుమార్ లేదా కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(pcc) అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువశాతం డీకే కె అవకాశం దక్కవచు.. మంత్రి పదవుల విషయానికొస్తే మెజారిటీ పదవులు జేడీఎస్ కు దక్కనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories