సంచలన తీర్పు ప్రకటించిన అమెరికా ఫెడరల్ కోర్టు

సంచలన తీర్పు ప్రకటించిన అమెరికా ఫెడరల్ కోర్టు
x
Highlights

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్ కూచిబొట్ల హత్య కేసులో... అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జాత్యాహంకార దాడికి పాల్పడి, శ్రీనివాస్‌ను...

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్ కూచిబొట్ల హత్య కేసులో... అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జాత్యాహంకార దాడికి పాల్పడి, శ్రీనివాస్‌ను కాల్చి చంపిన 52 ఏళ్ల ఆడమ్ పురింటన్‌కు కోర్టు జీవిత ఖైదును విధించింది. దీంతో పాటు నమోదయిన మరో రెండు కేసుల్లో...పురింటన్‌కు 14ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం కాన్సస్‌లోని ఫెడరల్ కోర్టు...శ్రీనివాస్‌ది జాత్యాహంకార హత్యేనని తేల్చిచెప్పింది. జీవిత ఖైదుతో పాటు మరో రెండు హత్య కేసుల్లో అతడికి 165 నెలల జైలు శిక్ష విధించింది.

కోర్టు తీర్పుపై శ్రీనివాస్‌ కూచిబొట్ల భార్య సునయన స్పందించారు. పురింటన్‌కు జీవిత ఖైదు శిక్ష విధించినంత మాత్రాన తన భర్త తిరిగి రాలేడన్న ఆమె....జాత్యాహంకార దాడులను సహించబోమనే గట్టి హెచ్చరికలు ఇచ్చినట్లైందన్నారు. కేసులో న్యాయమై తీర్పు రావడానికి కృషి చేసిన డిస్ట్రిక్ట్ అటార్నీ, పోలీసు శాఖకు సునయన కృతజ్ఞతలు తెలిపారు.

గడేడాది ఫిబ్రవరి 22న కాన్సస్‌ రాష్ట్రంలోని ఓలేత్ నగరంలో... ఓ బార్‌లో ఉన్న తెలుగు టెకీలు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిపై ఆడమ్ పురింటన్ కాల్పులు జరిపి...అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి వచ్చిన పురింటన్‌ తమ దేశం విడిచి వెళ్లాలంటూ అలోక్, శ్రీనివాస్‌లపై మళ్లీ కాల్పులు జరిపాడు. ఘటనలో శ్రీనివాస్‌ మృతి చెందగా, అలోక్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories