కేటీఆర్‌ సన్నాఫ్‌ కేసీఆర్‌

కేటీఆర్‌ సన్నాఫ్‌ కేసీఆర్‌
x
Highlights

ఉద్యోగ దశ నుంచి ఉద్యమ బాట పట్టిన ప్రస్థానం. జై తెలంగాణ అంటూ కేసీఆర్ అడుగుజాడలో నడిచిన ఉత్తేజం. అధినేతతో వేసిన అడుగులే ఎమ్మెల్యేగా మార్చిన నేపథ్యం. యువ...

ఉద్యోగ దశ నుంచి ఉద్యమ బాట పట్టిన ప్రస్థానం. జై తెలంగాణ అంటూ కేసీఆర్ అడుగుజాడలో నడిచిన ఉత్తేజం. అధినేతతో వేసిన అడుగులే ఎమ్మెల్యేగా మార్చిన నేపథ్యం. యువ ఎమ్మెల్యేగా నియోజవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించిన నాయకుడు. ఉరిసిల్ల నుంచి సిరుల ఖిల్లాగా మార్చేందుకు అహర్నిశలు శ్రమించిన రాజకీయ శ్రామికుడు... ఆయనే కల్వకుంట్ల తారకరామారావు సన్నాఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

కల్వకుంట్ల తారకరామారావు మాస్‌ పాలిటిక్స్‌లో కేటీఆర్‌‌గా... పాలిషిడ్‌ పొలిటిషీయన్ల మధ్య రామ్‌గా సుపరిచితుడైన తెలంగాణ ఐకాన్‌ లీడర్‌. కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చినా... పార్టీలో కీలకంగా, ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. అన్నిటా కీ రోల్‌ పోషిస్తున్నారు. చేనేతకు చిరునామా అయిన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తన ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించి.. కమ్యూనిస్టుల కంచుకోటను గులాబీ గుబాళింపునకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేశారు కేటీఆర్‌.

తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేటీఆర్ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగి రాజీనామాలు చేయడంతో వచ్చిన ఉపఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2009లో తొలిసారి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తర్వాత తెలంగాణ సాధన కోసమంటూ రాజీనామాల పర్వం మొదలవడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో సిరిసిల్లపై పట్టు సాధించారు. ప్రత్యర్థులను కోటలను బద్ధలు కొడుతూ ఎదురులేని శక్తిగా ఎదిగారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌ ఐటీపై తిరుగులేని పట్టు సాధించారు. గుంటూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన ఈ ఐకాన్‌ లీడర్‌ నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ, పుణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తర్వత న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఈ-కామర్స్ లో ఎంబీఏ చదివిన కేటీఆర్‌.. అమెరికాలోనే ఉద్యోగ జీవితం మొదలుపెట్టారుు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ట్విటర్ వేదికగా తన దృష్టికొచ్చే సమస్యలను పరిష్కరించి అందరి వాడుగా, యూత్‌కు యూనిక్‌ లీడర్‌గా మారారు.

సాధారణ కార్యకర్తలా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్‌ సమస్యల పద్మవ్యూహాలను దాటుకుంటూ ప్రజల మనసు గెలుచుకున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు సాధించి ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పాశుపతాస్త్రాలు సంధిస్తూ దూసుకుపోతున్నారు. ఐకాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా అవార్డులు అందుకొని తండ్రి తగ్గ తనయుడిగా తాను నడిచొచ్చిన దారిలోని మలుపులను మేలిమలుపుగా మార్చుకొని గెలిచి నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories