మంత్రి కేటీఆర్ పెద్ద‌మ‌న‌సు

మంత్రి కేటీఆర్ పెద్ద‌మ‌న‌సు
x
Highlights

క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డంలో ముందుండే కేటీఆర్ మ‌రోమారు త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ నేప‌థ్యంలో జువ్వాడి వినాయ‌క్ రావు అనే నెటిజ‌న్ చిన్నారికి...

క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డంలో ముందుండే కేటీఆర్ మ‌రోమారు త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ నేప‌థ్యంలో జువ్వాడి వినాయ‌క్ రావు అనే నెటిజ‌న్ చిన్నారికి సాయం చేయాల‌ని కోరారు. రెండేండ్ల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిండ్రులు ఆస్ప‌త్రిలో చేర్పించార‌ని..పేదరికంలో ఉన్న ఆ దళిత కుటుంబం ఇప్పటికే రూ.లక్షన్నరకు పైగా ఖర్చుచేసిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.అయితే నెటిజ‌న్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ బాధితులకు అండ‌గా నిలుస్తామ‌ని హామీ ఇస్తూ.. తన కార్యాలయ సిబ్బందితో తక్షణం వివరాలు తీసుకునేలా చేసిన సహాయం అందించారు.

బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్ప‌త్రిపాలైన ఓ మ‌హిళకు కేటీఆర్ స‌హాయం చేయ‌నున్నారు. నవీన్‌ అనే ఓ నెటిజన్‌ తన తల్లి బ్రెయిన్‌ స్ట్రోక్ తో ఆస్ప‌త్రిపాలైంది. ఆమె ఆరోగ్యం కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని…ఆమె కోలుకుంటున్న సమయంలో మరింత సొమ్ము కావాల్సి ఉందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దీంతో న‌వీన్ కు త‌గు స‌హాయం అందించాలని కేటీఆర్‌ తన బృందానికి సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories