త్వరలో ప్రభాస్ పెళ్లి...కృష్ణంరాజు క్లారిటీ...
టాలివుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లెప్పుడు చేసుకుంటాడంటూ టాలివుడ్ నుంచి బాలివుడ్...
టాలివుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లెప్పుడు చేసుకుంటాడంటూ టాలివుడ్ నుంచి బాలివుడ్ దాకా ప్రతిఒక్కరూ ఆరాలు తీస్తున్నారు. అదిగో పెళ్లి ఇదిగో ముహూర్తం అంటూ తెగ రూమర్స్ పుట్టిస్తున్నారు. అందుకే ప్రభాస్ పెళ్లిపై ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ప్రభాస్ పెళ్లెప్పుడు..?
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు కానీ ఇప్పటికీ ఆ ముచ్చట తీరనేలేదు. కేవలం అభిమానులే కాదు ప్రభాస్ ఓ ఇంటివాడైతే చూసి ముచ్చటపడాలని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు స్పందించారు. పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు బలవంతపెట్టినా ప్రభాస్ అప్పుడూ ఇప్పుడూ అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడు ఇప్పుడడిగితే మళ్లీ సాహో సినిమా తర్వాతే పెళ్లంటున్నాడని కృష్ణంరాజు చెప్పారు.
మరోవైపు తన పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించడం ప్రభాస్ కి అస్సలు నచ్చడం లేదు. అందుకే రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. పెళ్లి తన పర్సనల్ విషయమని దాని గురించి మాట్లాడటం తనకిష్టంలేదని సూటిగా సమాధానం చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. భారీ బడ్జెట్ తో సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఆ తర్వాత రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ మరో సినిమాలో నటించనున్నాడు. సో వరుస సినిమాలతో డార్లింగ్ బిజీగా గడపబోతున్నాడు. మరి పెదనాన్నకిచ్చిన మాట కోసమైనా ప్రభాస్ పెళ్లిపీటలెక్కుతాడేమో చూడాలి.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT