logo
తాజా వార్తలు

ఎమ్మెల్యే రోజాపై మండిప‌డ్డ కోటా శ్రీనివాస‌రావు

ఎమ్మెల్యే రోజాపై మండిప‌డ్డ కోటా శ్రీనివాస‌రావు
X
Highlights

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై న‌టుడు కోట శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు. కొద్దిరోజుల క్రితం రోజా నిర్మాత బండ్ల‌గ‌ణేష్ ...

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై న‌టుడు కోట శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు. కొద్దిరోజుల క్రితం రోజా నిర్మాత బండ్ల‌గ‌ణేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రోజా-బండ్ల‌గ‌ణేష్ లు వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై స్పందించారు. ఆ స‌మ‌యంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించ‌డంపై వారి మధ్య మాటలు శ్రుతిమించాయి. వీరిద్దరి మధ్య చ‌ర్చ‌లు తారాస్థాయికి చేరుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదంపై కోటా స్పందించారు. రోజాను ఓ రాజ‌కీయ నాయ‌కురాలిగా చూడ‌డంలేద‌ని అన్నారు.
ఎందుకంటే, బండ్ల‌గ‌ణేష్ - రోజాల మ‌ధ్య విమ‌ర్శ‌ల్ని చూశాను. ఓ బాధ్యాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న రోజా అలా మాట్లాడ‌కూడ‌ద‌ని , వాడంటే (బండ్ల గణేశ్) ఏదో కుర్ర వెధవ, పిచ్చోడిలా వాగాడు. రోజా అనుభవజ్ఞురాలు. ఎమ్మెల్యేగా ప‌నిచేస్తూ ఇలా మాట్లాడ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఆ అమ్మాయి గురించి నేనేమి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. బయటకు కనపడుతున్నది అది!’ అని అన్నారు.

Next Story