కండిషన్‌ లేదు... ప్రాణాలంటే కనికరమూ లేదు!!

కండిషన్‌ లేదు... ప్రాణాలంటే కనికరమూ లేదు!!
x
Highlights

కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌తో సహా 57 మంది మృతి చెందారు....

కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌తో సహా 57 మంది మృతి చెందారు. ఇంతమందిని బలితీసుకున్న బస్సు ప్రమాదానికి అతివేగం, ఓవర్‌లోడే కారణమని తెలుస్తోంది.

కొండగట్టు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆర్టీసి అధికారుల అనాలోచిత నిర్ణయం, డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. శనివారం పేట్ నుండి రాంసాగర్ , నాచుపెల్లి, దొంగలమర్రి , కొండగట్టు మీదుగా వెల్లాల్సిన బస్సును ఘాట్ రోడ్డుపై నుండి భారీ వాహనా లకు అనుమతి నిరాకరణ ఉన్నా, అదేమి పట్టించుకోకుండా ఆర్టీసి అధికారులు ఆదాయ ఆర్జనే ధ్యేయంగా నడపడం వల్లనే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు.

ఇక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ఘాట్‌ రోడ్డులో బస్సు అదుపు తప్పడంవల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.. ప్రమాద సమయంలో ఊపిరాడక కొందరు మృతిచెందినట్టు చెబుతున్నారు. సాధారణంగా బస్సు సామర్ధ్యం 40 నుంచి 43 మంది కాగా. ప్రమాదానికి గురైన బస్సులో 86 మంది ప్రయాణిస్తున్నారు.. వీరితో పాటు నలుగురు చిన్నపిల్లలు.. అంటే ప్రమాదం జరిగే సమయానికి బస్సులో మొత్తం 90 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు..

బస్సు సామర్ధ్యానికి రెట్టింపు జనాన్ని ఎక్కించడం కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.. బస్సును ఈ రూట్ గుండా నడపడడం అర్టీసి అధికారుల అనాలోచిత నిర్ణయం, వైఫల్య, నిర్లక్ష్యాలకు అద్దం పడుతుందని పలువురు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories