Top
logo

కాంగ్రెస్ లో చేరిన సమరసింహారెడ్డి.. నేడు కొండా సురేఖ?

కాంగ్రెస్ లో చేరిన సమరసింహారెడ్డి.. నేడు కొండా సురేఖ?
X
Highlights

మరి కొద్దిరోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో వలసలు జోరందుకున్నాయి. అందులో ముఖ్యంగా టీఆర్ఎస్...

మరి కొద్దిరోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో వలసలు జోరందుకున్నాయి. అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలలోకి ఆశావహులు చేరుతున్నారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన అసంతృప్తి నేతలు పక్క పార్టీలవైపు తొంగి చూస్తున్నారు. నిన్న కేటీఆర్ తో సమావేశమైన కాంగ్రెస్ నేత ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతుననట్టు ప్రకటించారు. ఇదిలావుండగా నిన్న(శుక్రవారం) మాజీమంత్రి డీకే సమరసింహారెడ్డి కుంతియా, ఉత్తమ్‌ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌, టీడీపీకి చెందిన పలువురు జిల్లాస్థాయి నాయకులు కూడా కాంగ్రెస్‌ లో చేరారు. అలాగే కేసీఆర్ ప్రకటించిన మొదటి విడత 105 మంది అభ్యర్థుల జాభితాలో తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేడు హరీష్ రావు లేదా కేసీఆర్ తో భేటీ అయ్యేఅవకాశాలున్నాయి. అనంతరం కొండా దంపతులు (సురేఖ, మురళి) తమ భవిశ్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఎక్కువగా ఆమె కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.

Next Story