Top
logo

కొండా కపుల్స్‌... హరీష్‌రావు గ్రూపా?

కొండా కపుల్స్‌... హరీష్‌రావు గ్రూపా?
X
Highlights

గులాబీ కోటలో ఏం జరుగుతుంది? బయట ప్రచారం జరుగుతున్నట్టు అసమ్మతి సెగలు కారును బేజారెత్తిస్తున్నాయా? టీఆర్ఎస్‌లో...

గులాబీ కోటలో ఏం జరుగుతుంది? బయట ప్రచారం జరుగుతున్నట్టు అసమ్మతి సెగలు కారును బేజారెత్తిస్తున్నాయా? టీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? కొండా సురేఖ... తాము హరీష్‌ వర్గమన్న విషయం అందరికీ తెలుసూ... అంటూ మీడియా ముందు ఎందుకు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయా? కేసీఆర్‌ కేంద్రంగా కేటీఆర్‌ గ్రూప్, హరీష్‌రావు గ్రూప్‌ అన్నట్టుగా పరిస్థితులు మారాయా? కొండా దంపతులు హరీష్‌ వర్గం కాబట్టే... సురేఖకు టికెట్‌ ఇవ్వలేదా? ఎర్రబెల్లి దయాకర్‌రావు తమపై విషం చిమ్ముతున్నారంటూ ఆరోపించిన కొండా మురళీ... తాము ఎవరి వర్గమో త్వరలోేనే తేలిపోతుందన్నట్టు ఎందుకు అన్నారు?

ఇవన్నీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు. ఇంతకీ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందసలు? ముందస్తు ఎన్నికల ప్రకటనకు ముందు... తర్వాత అన్నట్టుగా మారిన పరిస్థితులు గులాబీలో పైకి చెప్పుకోలేని గుబులు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య ధోరణులు కేటీఆర్‌, హరీష్‌రావు కేంద్రంగా గులాబీ ముళ్లు బలంగా గుచ్చుకుంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మాయల మరాఠి పాలన, దొరల పాలన, గుడ్డి పాలన కొనసాగుతుందంటూ కొండంత ఆగ్రహాన్ని వెల్లగక్కిన కొండా సురేఖ దంపతులు... మళ్లీ త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామన్నారు. ఏమైనా సురేఖ మాటల్లో ఆంతర్యం బయటపడిందనీ, అంతర్గత ఇంతకాలం చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు నిజమేనన్న వాస్తవం సురేఖ మాటల ద్వారా అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story