అందరికి న్యాయం జరిగి.. ఆమెకు అన్యాయం జరుగుతుందా?

అందరికి న్యాయం జరిగి.. ఆమెకు అన్యాయం జరుగుతుందా?
x
Highlights

కొండా సురేఖ.. ఈ పేరంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా అవకాశం వచ్చినా.. వైసీపీ అధినేత వైయస్ జగన్...

కొండా సురేఖ.. ఈ పేరంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా అవకాశం వచ్చినా.. వైసీపీ అధినేత వైయస్ జగన్ కోసం త్యాగం చేశారు. ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆమె తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. దాంతో ఆమెకు తెరాస అధినాయకత్వం 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ ఆపై మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ కొన్నిరాజకీయ సమీకరణాల్లో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఇదిలావుంటే నిన్న(గురువారం) తెరాస ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందారు. అయితే ఆమె భూపాలపల్లి నియోజకవర్గంలో వేలు పెట్టడంతోనే అధిష్టానానికి కోపం రావడంతో ఆమె సీటు పెండింగ్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి పార్టీ అధిష్టానంతో మాట్లాడగా ఏం పర్వాలేదు టికెట్ వస్తుంది అని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు సింట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికి టికెట్లు కేటాయించిన న్యాయం చేసిన కేసీఆర్.. సురేఖకు అన్యాయం చేయరు అని నియోజకవర్గంలో అనుకుంటున్నారు. ఆమెకు టికెట్ వస్తుందో రాదో మరికొద్ది రోజుల్లో తేలనుంది. కాగా టికెట్ పెండింగ్ పరిణామాలపై రేపు(శనివారం) మధ్యాహ్నం కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories