Top
logo

తెలంగాణ బీజేపీకి షాక్..కీలకనేత నేత గుడ్‌ బై..

తెలంగాణ బీజేపీకి షాక్..కీలకనేత నేత గుడ్‌ బై..
X
Highlights

తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీలో కీలకనేతగా ఉన్న జనగామ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి...

తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీలో కీలకనేతగా ఉన్న జనగామ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జిల్లా ప్రజల కోరిక మేరకే తాను బీజేపీకి రాజీనామా చేశానని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. నాతోపాటు అన్ని మండలాల్లోనూ మద్దతుదారులు బీజేపీకి రాజీనామా చేస్తున్నారు. నాలుగేళ‌్లుగా పార్టీ అభివృద్ధి కోసం పని చేసాను. గత ఏడాది నుండి నా మీద ఒత్తిడి ఉంది. 2001 నుండి నేను టీఆర్‌ఎస్‌లో ఉన్నాను. జడ్పీటీసీ, ఎమ్మెల్యే గా గెలిచాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బీజేపీకి రాజీనామా చేశాను. జనగామ బీజేపీలో క్రమశిక్షణ లేదు. సరి చేయడానికి ప్రయత్నం చేసినా కుదరలేదు. అదికూడా నా రాజీనామాకు కారణం. జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరుగుతానని, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ఏ పార్టీలో చేరేదానిపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.

Next Story