గెలిచినా రాజీనామా చేస్తా: కోమటి రెడ్డి వెంకటరెడ్డి

గెలిచినా రాజీనామా చేస్తా: కోమటి రెడ్డి వెంకటరెడ్డి
x
Highlights

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. ఇప్పటివరకూ దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 3,584కు చేరింది. చివరి రోజు...

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. ఇప్పటివరకూ దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 3,584కు చేరింది. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జానారెడ్డి, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, అలాగే మాజీ ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. మంగళవారం రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించి అర్హులైన వారి నామినేషన్లను ఆమోదించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 22న ముగియనుంది. నామినేషన్‌ కార్యక్రమం సందర్బంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలకనేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెరాస నేతలు అంటున్నారు, అదే జరిగితే తాను ఎమ్మెల్యేగా గెలిచినా పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెరాస నేతలు మండిపడుతున్నారు. మహాకూటమి అధికారంలోకి రాకపోతే టీపీసీసీ సహా కాంగ్రెస్ నేతలంతా రాజకీయాలనుంచి తప్పుకుంటారా అన్న కేటీఆర్ సవాల్ ను స్వీకరించాలని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories