మిలియన్‌ మార్చ్‌: కోదండరాం వర్సెస్‌ పోలీస్‌

మిలియన్‌ మార్చ్‌: కోదండరాం వర్సెస్‌ పోలీస్‌
x
Highlights

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా మిలియన్‌ మార్చ్ నిర్వహించేందుకు కోదండరాం రెడీ అవుతున్నారు. టీజేఏసీ నేతలు కోదండరాం ఇంటికి చేరుకుంటున్నారు. అయితే...

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా మిలియన్‌ మార్చ్ నిర్వహించేందుకు కోదండరాం రెడీ అవుతున్నారు. టీజేఏసీ నేతలు కోదండరాం ఇంటికి చేరుకుంటున్నారు. అయితే కోదండరాం ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కోదండరాం ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ట్యాంక్‌ బండ్‌ఫై మిలియన్‌ మార్చ్‌‌కు అనుమతి ఇవ్వకపోవడంపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలనకు ఇదే నిదర్శనమన్న ఆయన నాటి మిలియన్ మార్చ్‌ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు కదులుతూనే ఉన్నాయన్నారు. 2011లో ఎన్ని ఆంక్షలు ఉన్నా మిలియన్‌ మార్చ్‌ను విజయవంతం చేసుకున్నామని కోదండరాం గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories