నిర్లక్ష్యం నీడలో కింగ్ కోఠి ప్రసూతి ఆస్పత్రి

నిర్లక్ష్యం నీడలో కింగ్ కోఠి ప్రసూతి ఆస్పత్రి
x
Highlights

డెలివీరి అంటే ఆడవాళ్లకు మరో జన్మనెత్తడం. అలాంటిది సిజేరియన్ చేసిన బాలికంతలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు సరైన వైద్యం అందించాలి. హైదరాబాద్ లోని...

డెలివీరి అంటే ఆడవాళ్లకు మరో జన్మనెత్తడం. అలాంటిది సిజేరియన్ చేసిన బాలికంతలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు సరైన వైద్యం అందించాలి. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేని చాలామంది పేదవారు.. డెలివరీ కోసం కింగ్ కోఠి ఆస్పత్రిలో చేరుతుంటారు. అయితే, ఇక్కడ ఆపరేషన్ జరిగిన రోగులకు వైద్యుల నిర్లక్ష్యం చుక్కులు చూపిస్తోంది. కింగ్ కోఠి మెటర్నరీ ఆస్పత్రుల్లో డెలివరీ కోసం నిత్యం వందల మంది జాయిన్ అవుతుంటారు. వీరిలో సుమారు సగం మందికి సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుంది. అయితే, సిజేరియన్ చేయించుకున్న వారిలో చాలామంది బాలింతలకు స్పెషల్ రూమ్స్ తీసుకునే స్తోమత లేక.. జనరల్ వార్డులోనే ఉంటారు. ఆపరేషన్ అయిన తర్వాత నుంచి వైద్య సింబ్బందే.. రోగులకు డ్రెసింగ్ చేయాలి. అయితే, కింగ్ కోఠి ఆస్పత్రిలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సిజేరియన్ తర్వాత కనీసం ఐదు రోజుల పాటు.. బాలింత ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది సైతం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, కింగ్ కోఠి ఆస్పత్రిలో మాత్రం ఇందు సీన్ పూర్తి రీవర్స్ లో ఉంటుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత కొద్దిపాటి జాగ్రత్తలు చెప్పి.. వైద్యులు, నర్సులు తమ చేతులు దులుపుకుంటున్నారు. అక్కడి నుంచి వైద్య సిబ్బంది నిర్వర్తించే డ్రెస్సింగ్, బేబి కేరింగ్, బాలింతలకు సూచనలు చేయడం లాంటివన్నీ హౌస్ కీపింగ్ సిబ్బంది చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్ వార్డులోనే కాదు.. స్పెషల్ వార్డులోనే అదే తంతు. ప్రత్యేక వార్డులోనైనా తమకు కేరింగ్ ఎక్కువగా ఉంటుందనే ఆశతో స్పెషల్ వార్డులో చేరిన బాలింతలకు సైతం.. వైద్య సిబ్బంది నుంచి అదే నిర్లక్ష్యం ఎదురవుతోంది. పైగా.. ప్రభుత్వాస్పత్రి అని కూడా మరిచిపోయి, అక్కడి సిబ్బంది ఒక్కో పనికి ఒక్కో అమోంట్ డిమాండ్ చేస్తున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories