జనం మీదకు దూసుకెళ్లిన లారీ... ముగ్గురు దుర్మరణం

జనం మీదకు దూసుకెళ్లిన లారీ... ముగ్గురు దుర్మరణం
x
Highlights

ఖమ్మం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. వైరా మండలం పినపాక దగ్గర లారీ అదుపు తప్పి జనం మీదకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి దామిని తో సహా...

ఖమ్మం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. వైరా మండలం పినపాక దగ్గర లారీ అదుపు తప్పి జనం మీదకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి దామిని తో సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చిక్సితపొందుతున్నవారిని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కలవరపడొద్దని భరోసా ఇఛ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లుకు సూచించారు.

మృతులు చిన్నారి దామిని పరిస్థితిని తలచుకుని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టిన రోజు నాడే చిన్నారిని మృత్యుదేవత వెంటాడిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. బర్త్‌ డే రోజు సరదాగా గడిపేందుకు తండ్రి హోటల్‌కు తీసుక వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం దారుణమని కన్నీరుమున్నీరవుతున్నారు. ముద్దు ముద్దు మాటలతో సందడి చేసిన చిన్నారి ఇకలేదన్న చేదు నిజం గుర్తు తెచ్చుకుని రోదిస్తున్న తీరు పలువురి చేత కంటతడిపెట్టిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories