కాలక్షేపంకోసం పాడుకున్న పాట అతడి జీవితాన్నే మార్చేసింది..

ఓ వ్యక్తి పొలం గట్టున కాలక్షేపం కోసం పాడుకున్న పాట అతడి జీవితాన్నే మార్చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్...
ఓ వ్యక్తి పొలం గట్టున కాలక్షేపం కోసం పాడుకున్న పాట అతడి జీవితాన్నే మార్చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. సాక్షాత్తు అతని గొంతుకు శంకర్ మహాదేవ సైతం ఫిదా అయిపోయాడు. దీంతో ఉండబట్టలేక ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేసి మరీ అభిన్నందించాడు సుప్రీం సింగర్. అంతేకాదు త్వరలోనే ఇద్దరం కలిసి పాడదామని హామీ ఇచ్చాడు.
కేరళ రబ్బర్ తోటల్లో పనిచేసే ఇతని పేరు రాకేశ్.. రబ్బర్ చెట్లను నరికి.. వాటిని మోసుకెళ్లి లారీలో ఎక్కించడం రాకేశ్‌పని. మధ్యాహ్న భోజన సమయంలో.. కమల్ హాసన్ విశ్వరూపంలోని తమిళ పాట 'ఉనై కానాదు నాన్ ఇంద్రు నాల్ ఇలయే...' అంటూ పాడాడు. ఈ క్రమంలో అతడు పాడిన పాటను.. లారీ డ్రైవర్ రికార్డ్ చేశాడు. అది చూసిన లారీ డ్రైవర్ చెల్లెలు వెంటనే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. అది అటూ ఇటూ తిరిగి.. శంకర్ మహదేవన్ చెవులకు వినిపించింది.
ఆ వాయిస్ విని.. శంకర్ మహదేవన్ మెస్మరైజ్ అయిపోయాడు. అతడి నెంబర్‌ను కనిపెట్టి.. డైరెక్ట్‌గా రాకేశ్‌కే ఫోన్ చేసి మరీ అభినందించాడు. శంకర్ మహదేవన్ అంటే పడిచచ్చిపోయే రాకేశ్.. తన అభిమాన గాయకుడే స్వయంగా ఫోన్ చేసే సరికి ఆశ్చర్యపోయాడు. అయితే.. అతడికి మరో షాక్ ఇచ్చాడు శంకర్ మహదేవన్.. ఇద్దరం కలిసి పనిచేద్దామంటూ చెప్పేశాడు. పైగా రాకేష్ పాడిన పాటను శంకర్ మహదేవన్ తన పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అంతే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT