రేవంత్ రెడ్డి దూకుడుకు టీఆర్ఎస్ క‌ళ్లెం..?

రేవంత్ రెడ్డి దూకుడుకు టీఆర్ఎస్ క‌ళ్లెం..?
x
Highlights

టీ కాంగ్ లీడ‌ర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారా..? ఆరోప‌ణ‌లో ప్ర‌త్యారోప‌ణ‌లతో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్న...

టీ కాంగ్ లీడ‌ర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారా..? ఆరోప‌ణ‌లో ప్ర‌త్యారోప‌ణ‌లతో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్న రేవంత్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆపార్టీ అధినేత కేసీఆర్ తో సంప్ర‌దింపలు జ‌రిపార‌ని టాక్ .


కొద్దిరోజుల క్రితం తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇచ్చారన్న రేవంత్‌.... ఈ నియామకాలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తొమ్మిది మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేల తరహాలో లాభదాయక పదువుల్లో ఉన్న టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారని, మరో ముగ్గురు లాభదాయక పదవుల్లో ఉన్నారని లేఖలో ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ రేవంత్ ధాటికి తట్టుకోలేక కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్న‌ట్లు వినికిడి. ప్రభుత్వం అభ్యంతర కర భాషపై కోర్టుతో సంబంధం లేకుండా నేరుగా అరెస్ట్ చేసే ఒక జీవో ను సైతం కేసీఆర్ తెచ్చేశారు. అవసరాన్ని బట్టి రేవంత్ ను ఈ జీవో ఆధారంగా ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేయాల‌ని పావులు క‌దుపుతున్న‌ట్లు పొలిటికల్ క్రిటిక్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. వీటితో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల‌లు లోగా ఓటుకునోటును తిర‌గ‌దోడితో రేవంత్ కు చెక్ పెట్టొచ్చ‌ని గులాబీనేత‌లు భావిస్తున్న‌ట్లు టాక్ అందులో భాగంగా వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారు ఇప్పటికే ఆ తరహా దాడి మొదలు పెట్టేశారు కూడా. ఓటుకు నోటు కేసులో రేవంత్ కి త‌మ‌పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని ఎదురుదాడి ప్రారంభించారు.


ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు సీఎం చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల సీఎం ల మ‌ధ్య అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని, అందుకే కేసును సుప్త చేత‌న అవ‌స్థ‌లో ఉండచ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగింద‌న్న‌ది పొలిటిక‌ల్ టాక్ . ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై రేవంత్ చేస్తున్న ఆరోప‌ణ‌ల్ని తిప్పికొట్టేలా త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటు కేసు ను మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అంటున్నారు .


ఈ కేసు వేగవంతం చేస్తే చంద్రబాబు అనూహ్యంగా ఇరుకున పడటం ప్రచారం లోకి రావడం జరిగిపోతాయి. దానివల్లే ఇప్పటివరకు బ్రేక్ లు వేస్తూ వస్తున్న టి సర్కార్ రేవంత్ దూకుడు ఇలాగే కొనసాగితే తప్పని పరిస్థితిలో మళ్ళీ పాత కేసులో అల్లరి చేసేందుకు సిద్ధం కావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories