58 ఏళ్లు కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణకు ఏంచేశాయ్ : కేసీఆర్

58 ఏళ్లు కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణకు ఏంచేశాయ్ : కేసీఆర్
x
Highlights

మహాకూటమిని ఉద్దేశించి తెరాస అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్ మహాకూటమిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు...

మహాకూటమిని ఉద్దేశించి తెరాస అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్ మహాకూటమిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. లేదంటే కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాజగా కేసీఆర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గెలిస్తే మరోసారి సేవ చేస్తా.. ఓడితే నష్టమేమీ లేదు విశ్రాంతి తీసుకుంటా అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆపార్టీలోని నేతలను అయోమయానికి గురిచేశాయి. ఎప్పుడు ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే కేసీఆర్‌ నోట ఇలాంటి మాటలు విన్న కేడర్‌ ఒక్కసారి షాక్‌కు గురైంది. ప్రతి రోజూ వరుస ప్రచార సభలతో హోరెత్తిస్తున్న కేసీఆర్‌.. ఖానాపూర్‌ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఉత్తమ్ సహా కీలక నేతలపై నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. గురువారం మూడు జిల్లాల్లో వరుస సభలతో ప్రచారాన్ని ఉదృతం చేశారు.

ఓ వైపు తాను ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్న.. కేసీఆర్‌.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. గత 58 ఏళ్లు కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణకు ఏం చేశాయని ప్రశ్నించిన అయన.. కొందరు తెలంగాణ నేతలు అమరావతికి బానిసలుగా పని చేస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పినవి.. చెప్పని పథకాలను కూడా తమ పార్టీ అమలు చేస్తోంది అన్నారు. మళ్లీ తనకు అధికారం ఇస్తే ఇప్పుడున్న పెన్షన్లను 2 వేల రూపాయలకు పెంచుతామన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అమలవుతున్న రైతు బంధు పథకం కింద ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories