మూడు స‌ర్వేలు..ప‌దిల‌క్ష‌ల‌మంది జ‌నం

మూడు స‌ర్వేలు..ప‌దిల‌క్ష‌ల‌మంది జ‌నం
x
Highlights

కేబినెట్ విస్త‌ర‌ణ చేస్తున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌తో టీఆర్ఎస్ నేత‌ల గుండెల్లో రైలు ప‌రిగెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు...

కేబినెట్ విస్త‌ర‌ణ చేస్తున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌తో టీఆర్ఎస్ నేత‌ల గుండెల్లో రైలు ప‌రిగెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు షాక్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


కేబినెట్ విస్తరణకు తెలంగాణ సర్కార్ త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుత కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజులపాటు ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై తుది కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందుకు దాదాపు మూహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గం విస్తరణ చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజుల నుంచి ఫామ్‌హౌజ్‌లో సీఎం.. పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ముగ్గురు, నలుగురు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వారందరినీ తప్పించి, పలువురు మహిళలను కేబినెట్లోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


ఈ నేప‌థ్యంలో కేంద్రం ముంద‌స్తు ఎన్నిక‌లొస్తున్నాయంటూ హింట్ ఇచ్చింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల కోసం కేసీఆర్ గెలుపు గుర్రాల్ని అన్వేషించే ప‌నిలో ప‌డ్డార‌ట‌. అటు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న సీఎం అటు పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరుపై ఓ క‌న్నేసి ఉంచిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎమ్మెల్యేల ప‌నితీరుపై బెస్ట్ ఆఫ్ త్రీ స‌ర్వే నిర్వ‌హించి ...ఆ స‌ర్వే ఆధారంగా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధిని బేరీజు వేసుకుంటూ స‌ద‌రు నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పొలిటిక‌ల్ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.


ఇప్ప‌టికే మూడు సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన సీఎం దాదాపు 10ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌తో స‌ర్వే చేయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వీటిపై టీఆర్ఎస్ నేత‌లు వాపోతున్నార‌ట‌. బెస్ట్ ఆఫ్ త్రీ అని చెప్పి మూడు సర్వేలు చేయించడం ఎంతవరకూ న్యాయం అంటూ అనుచ‌రులతో మొర‌పెట్టుకుంటున్నార‌ట‌. మరి కేసీఆర్ బెస్ట్ ఆఫ్ త్రీ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది

Show Full Article
Print Article
Next Story
More Stories