థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్లాన్‌ ఇదే

థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్లాన్‌ ఇదే
x
Highlights

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్‌...అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాలు, సంస్థలు, ప్రముఖులతో...

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్‌...అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాలు, సంస్థలు, ప్రముఖులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి ఆలిండియా సర్వీస్ అధికారులతో భేటీ కానున్నారు. జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో పని చేసి పదవీ విరమణ పొందిన సీనియర్‌ అధికారులతో సమావేశమై ఎజెండాను రూపొందించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా సైనిక, వాయు సేన, వైమానిక అధికారులు, న్యాయనిపుణులు, అఖిల భారత రైతు సంఘాలు, పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆయా అధికారులను సంప్రదించడానికి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా సమన్వయకర్తలను నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories