Top
logo

ఆ 14 నియోజకర్గాల్లో పెండింగ్.. ఎందుకంటే?

X
Highlights

ముందస్తు గంట మోగించిన టిఆరెస్ అధినేత కేసిఆర్ ఏకంగా 105 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేసి సమరానికి సై అన్నారు....

ముందస్తు గంట మోగించిన టిఆరెస్ అధినేత కేసిఆర్ ఏకంగా 105 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేసి సమరానికి సై అన్నారు. చాలా మంది సిటింగ్ లకు సీట్లు ఖరారైనా.. ఇద్దరికి మాత్రం టిక్కెట్లు నిరాకరించగా, అయిదుగురు సిటింగ్ ల సీట్లను పెండింగ్ లో పెట్టారు. మరో 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

తెలంగాణలో ముందస్తు నగారా మోగింది. వందకు వంద సీట్లు గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్న టిఆరెస్ అధినేత కేసిఆర్ ఒకేసారి 105 మంది అభ్యర్ధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. వాస్తవానికి రెండు నెలల నుంచే ముందస్తు పై అత్యంత రహస్యంగా కసరత్తు చేస్తున్న కేసిఆర్ వారం క్రితం ఢిల్లీ వెళ్లి మూడు రోజులు ఉండి పనులన్నీ చక్కబెట్టుకున్నారు ముందస్తు ఎన్నికలకు సానుకూలత చేసుకుని తిరిగొచ్చారు. అనుకున్న టైమ్ కే అనుకున్న రీతిలోనే అసెంబ్లీ రద్దు చేశారు. మొత్తం 119 స్థానాలకు గానూ పక్కా ప్లాన్ తో అభ్యర్ధులను స్క్రీనింగ్ చేశారు సిటింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై రహస్య సర్వేలు, నియోజక వర్గాలలో వారికున్న ఆదరణ పరంగా వారిని అంచనా వేశారు. ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలకు పనితీరు బాగోలేదన్న కారణంగా టిక్కెట్ నిరాకరించారు. తొలిజాబితాలో 105 మందికి స్థానం కల్పించారు. మొత్తం14 సీట్లపై నిర్ణయంపెండింగ్ లో పెట్టారు ఖైరతాబాద్, మల్కాజ్ గిరి, మేడ్చల్, మలక్ పేట్, చొప్పదండి, అంబర్ పేట్ ,వికారాబాద్, వరంగల్ ఈస్ట్, కోదాడ,హూజూర్ నగర్, గోషా మహల్, ముషీరాబాద్, చార్మినార్ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికను వాయిదా వేశారు. ఈ నియోజక వర్గాల్లో కొన్నింటిలో ఇతర పార్టీల నుంచి కీలక నేతల చేరికలున్న కారణంగా వాటిని పెండింగ్ లో ఉంచారు. మేడ్చల్ సీటును కాంగ్రెస్ నుంచి టిఆరెస్ లో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి మరిన్ని చేరికలు ఉన్నందున ఆ సీనియర్ల కోసం కొన్ని స్థానాలపై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు. అలాగే ఎంఐఎం, బిజెపి అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికనూ వ్యూహాత్మకంగా పెండింగ్ లో పెట్టారు.

Next Story