Top
logo

కేసీఆర్ డ్యామేజ్ చేస్తే.. పిల్లలు సరి చేస్తున్నారు!

కేసీఆర్ డ్యామేజ్ చేస్తే.. పిల్లలు సరి చేస్తున్నారు!
X
Highlights

ఏ సభలో అయినా సరే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఇస్తున్నారు అంటే.. ఎవరినో ఒకరిని టార్గెట్ చేయకుండా...

ఏ సభలో అయినా సరే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఇస్తున్నారు అంటే.. ఎవరినో ఒకరిని టార్గెట్ చేయకుండా వదలరు. అలాగే.. ఈ మధ్య ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ.. మోడీ గాడు అని అనేశారు. దీంతో.. బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా.. హైదరాబాద్ పర్యటనలో అసంతృప్తి తెలిపారు.

దీంతో.. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ కావాలని అలా అనలేదని.. పొరపాటున నోరు జారారని వివరణ ఇచ్చి నిర్మలను చల్లబరిచినట్టు వార్తలు వినిపించాయి. తర్వాత.. కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత కూడా నష్ట నివారణ చర్యల్లో భాగమయ్యారు. యావత్ భారతావనికి ప్రధాని అయిన మోడీని కేసీఆర్.. అవమానించలేదని చెప్పుకొచ్చారు. మోడీ గారు.. అనే ప్రయత్నంలో.. అప్రయత్నంగా మోడీ గాడు అని వచ్చినట్టుగా వివరణ ఇచ్చుకున్నారు.

మొత్తంగా.. కేసీఆర్ చేసిన కామెంట్లతో బీజేపీ నేతలు బాగానే రాజకీయం చేస్తుండగా.. దాన్ని చల్లబరిచే రీతిలో.. సెంటిమెంట్ పండించేందుకు కేసీఆర్ పిల్లలు కవిత, కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. దీంతో… ముందు ఎందుకు నోరు జారాలి.. తర్వాత ఇలా ఎందుకు ఇబ్బంది పడాలి.. అని జనం అంటున్నారు.

Next Story